Friday, 27 January 2012

ఇడ్డెన్లు - సెనిమాలు

ఈ రోజులలో ఇడ్లీ తయారు చేయడం అంటే చాలా సులభంగా అయిపోతోంది కానీ మా చిన్నతనం లో ఇడ్లీలు తయారు చేయడం ఒక పెద్ద పనిగా ఉండేది. మా అమ్మ ఇడ్లీలని ఇడ్డెన్లు అని పలికేది. ఆవిడ బతికి ఉంటె ఇప్పుడు ఆవిడకి 74   సంవత్సరాలు ఉండేవి. ఆ ఇడ్డెన్లు తయారు చేయడానికి మినప పప్పుని ముందురోజు సాయంత్రం రెండు మూడు గంటల పాటు నానపోసి, దానితో పాటుగా ఉప్పుడు రవ్వ కూడా నాన పోసేవారు. కొంతమంది శిష్టుల ఇళ్ళలో ఆ ఉప్పుడు రవ్వని ఉపయోగించేవారు కాదు. వాళ్ళు బియ్యాన్ని నూక పట్టించి ఇంట్లో ఉంచుకొనే వారు. కానీ ఈ ఉప్పుడు రవ్వకి ఉన్న ప్రాశస్త్యం బియ్యపు రవ్వకి ఉండేది కాదు. ఆ నాన పెట్టిన మినప పప్పుని రుబ్బి దానిలో ముందుగా నానబోసిన ఉప్పుడు రవ్వో లేదా బియ్యపు రవ్వో ఉప్పు వేసి కలిపి గిన్నె పై మూత పెట్టేవారు. మరునాడు పొద్దున్నే లేచి ఆ పిండి ఎలా ఉందొ పరీక్షించేవారు. అప్పటికి ఆ పిండి బుస బుసా పొంగి చూడడానికి కాచిన పాల మీది పొంగులాగా కనిపించేది. ఆ ఊరుపిండిని ఇడ్డెన్లు (మా అమ్మ పరిభాషలో) పాత్ర ఇత్తడిది   ఉండేది దానికి రెండే ప్లేట్లు ఉండేవి ఒక్కొక్క ప్లేట్ లోనూ మూడూ లేదా నాలుగు ఇడ్లీలు తయారయ్యేవి. ఆ ప్లేట్ల మీద గుడ్డ వేసి ఈ తయారైన ఊరు  పిండిని  వేసి పాత్రలో నీళ్ళు పోసి ఈ ఊరు పిండి వేసిన ప్లేట్లని ఆ పాత్రలో ఉంచి మూత పెట్టి పొయ్యి మీద పెట్టేవారు. ఆ రోజులలో గేస్ స్టవ్ లు లేవు. అందుచేత కట్టెల పొయ్యి ఇంట్లో తాయారు చేసేవారు. ఆ తరువాత ఉదికాయో లేదో చూసుకొని దించిన తరువాత ఆ ఇడ్డెన్లు ని పెట్టడానికి చట్నీ తయారు చేయడం, దానితో పాటుగా సాంబారు తయారు చేయడం ఒక ప్రహసనం గా జరిగేది. ఈ రోజు అంట కష్టపడక్కరలేకుండా మిక్సీలు, గ్రైన్డర్లూ ఉన్నాయి. అంతేకాకుండా ఇడ్లీ పాత్రలు నాలుగు అయిదు ప్లేట్లు ఒక్కసారిగా పట్టే పాత్రలు కూడా ఉండడం వలన ఇడ్లీ తయారీ అంత కష్టమైన పని కాదు. ఇప్పుడు ఇంకా అడ్వాన్సు అయి ఇన్స్టెంట్ ఇడ్లీ పిండి కూడా వచ్చేసింది. అందుచేత ఇడ్లీ తయారీ ఇంకా సులభతరం అయిపొయింది.

ఆ విధంగానే, మా అమ్మ గారు, నాయనమ్మ, అమ్మమ్మ గారలు సినిమాలని సెనిమాలు అనేవారు. ఇప్పుడు నా కూతురు 14 సంవత్సరాల పిల్ల కి చెబితే ఒకటే నవ్వు. మా అమ్మకి ఆ సెనిమాలు చూడడం చాలా ఇష్టంగానే ఉండేది. ఆవిడ నెలకు ఒకటి రెండు సెనిమాలు తప్పక చూసేది. మేము పెద్దవాళ్ళం అయి ఉద్యోగాలు వచ్చి వేరే చోట్ల స్థిరపడ్డాక ఆవిడ ఆ విధంగా సెనిమాలు చూడడం మానేసింది. మా మేనత్తకి కూడా ఈ సేనీమాల పిచ్చి బాగానే ఉండేది. ఇంకా మేము పిల్లలం అంతా మా మేనత్తగారి పిల్లలూ, నేను మా చిన్నన్నయ్య మా చెల్లెలు అందరమూ దసరా, సంక్రాంతి, వేసంగి సెలవులకి తాతయ్యగారి ఇంటికి వెడితే మాకు ఇంక ఈ సినిమాల పండగే. మా పెద్దన్నయ్య మాతో వచ్చేవాడు కాదు కారణం నా కన్నా దగ్గర దగ్గర అయిదు సంవత్సరాలు పెద్ద. అందుకని మాతో సినిమాలకి ఆంటే మాట్నీలకి వచ్చేవాడు కాదు. తాను తన స్నేహితులతో చూసేవాడు. కొత్త సినిమా వస్తే తాతయ్యగారి దగ్గరకి మా మేనత్తగారి పెద్దవాడిని (మా చెల్లెలి వయసువాడు) పంపి సినిమాకి ఆరోజు మాట్నీకి కావలసిన డబ్బులు ఇచ్చేవరకూ ఆయనని కోసి కొప్పరాళ్ళకు  వేసేసి ఆఖరికి సాధించేవాళ్ళం. ఇంక మా పిన తండ్రుల పిల్లలు బాగా చిన్న పిల్లలవడం మూలానా వారిని మేము తీసుకెళ్ళే వారం కాదు. దానికి వాళ్లకి కోపాలు కూడా వచ్చేవి. అయినా మేం పట్టించుకోనేవాళ్ళం కాదు.

ఈ విధంగా ఆనాటి పాత మధుర జ్ఞాపకాలు గుర్తుకు చేసుకొంటూంటే ఎంత బాగుంటుంది. సినిమాలని సెనిమాలు అనడం లేదా ఇడ్లీలని ఇడ్డెన్లు అనడం అదో అనుభూతి.

Friday, 20 January 2012

అంబేద్కర్ - దేశ భక్తుడా? దేశ ద్రోహా?

భీమ్ రామ్ జీ ఆంబేద్కర్ ని దేశ భక్తుడు అనదగ్గ కారణాలు ఏవీ నాకైతే కనబడలేదు. కానీ ఉత్తర్ ప్రదేశ్ లోని నేతామణి కుమారి మాయావతి ఆవిడ నిత్యమూ పూజించే కాన్షీ రామ్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోని సంకర రావు లేదా మంద కృష్ణ మాదిగ లేదా కత్తి పద్మారావు మరియూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఆంబేద్కర్ కి ఇవ్వ వలసిన గౌరవం కన్నా ఎక్కువ ఇచ్చి మిగిలినవారిని వెధవలు అని నిరూపించ ప్రయత్నం చాలా సార్లు చేశారు. ఇప్పుడూ చ్సెస్తున్నారు.

నా దృష్టి లో ఆంబేద్కర్ ఒక దేశ ద్రోహి. బరోడా మహారాజు కి అమ్ముడుపోయి ఆ రాజు కాళ్ళు ఒత్తిన వ్యక్తి. మాహాత్మా గాంధీ ఈ దళిత నేతని తమ సమాజం వారిని మిగిలిన దళితులని స్వాతంత్ర్య పోరాటం లో పాలుపంచుకొనేవిధంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడానికి రమ్మనమని నిమంత్రణ ఇస్తే దానిని తిరస్కరించి, బ్రిటిష్ వాళ్ళకి తొత్తుగా వ్యవహరించిన మగానుభావుడు. ఈయన 1936లో స్వంతంగా ఇండెపెండెంట్  లేబర్ పార్టీ పెట్టి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కి ఒక 15 స్థానాలు గెలుచు కొన్నాడు. తాను పుట్టిన మతంలో తనకు అవమానం జరిగిపోతోందంటూ వెళ్లి బౌద్ధ మతం లో చేరిపోయాడు. స్వంత మతం మీద నమ్మకం లేక ఇతరమతాలలో దూరేవాళ్ళకు ఉండే దుర్గుణాలు అన్నీ ఈ పుణ్యపురుషుడు మూటకట్టుకొన్నాడు.  ఎలాగంటే హిందీ లో సామెత ఉంది 'నయా ముల్లా ప్యాజ్ తేజ్ ఖాతా హై' అని ఆ విధంగా ఒక మతం మీద కక్ష కట్టిన దయామయుడు మన అంబేద్కరుడు.

భారత దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న చాలా మండి దేశ ద్రోహులు స్వతంత్రం వచ్చాక అనేక రకాల పదవులు పొందిన వారు ఉన్నారు. వారిలో మన అంబేద్కరుడు అగ్ర తాంబూలానికి అర్హుడు. కారణం ఈయనని స్వతంత్ర ఉద్యమం లో పాలుపంచుకొమ్మంటే కాదు పొమ్మన్న పెద్దమనిషి భారత రాజ్యాంగ కమిటీ కి అధ్యక్షుడిగా చేయ బడి ఎంతోమంది కష్టపడి తయారుచేస్తే మొదటి పుట పైన తన సంతకాన్ని గిలికి అది తనదే అన్న బిల్డప్ ఇచ్చిన అరివీరభయంకరుడు. అంటే ఎదుటివారి శ్రమని దోచుకొన్న మహా మనిషి.  

ఈయన లోక్ సభ కి గెలవలేని నాయ్కుడు. ఆ తరువాత మన విజయ్ మాల్య లేదా రాహుల్ బజాజ్ లేదా హేమామాలిని లాగా దొడ్డి దారిన అనగా రాజ్య సభకి నామినేట్ చేయబడిన మహా నాయకుడు. ఈయనని ప్రధాన మంత్రి నెహ్రూ తన లా మినిస్టర్ గా నియమిస్తే, తనకి మంచి పోర్ట్ ఫోలియో ఇవ్వమని నిస్సుగ్గుగా అడగగలిగిన పురాణ పురుషుడు.

దేశానికి రిజర్వేషన్లు అనే శాపాన్ని ఇచ్చి, కులాల కుమ్ములాట అనేదానికి ప్రాణం పోసిన అపర బ్రహ్మ. ఇటువంటి వ్యక్తిని భుజాన మోసుకొని తిరిగే వాళ్ళు మన మాయావతి, కన్షీరామ్, కాంగ్రెస్ నాయకులు మరియూ తదితర పార్టీల నాయకులు. ఇటువంటి వాడికి భారత రత్న చచ్చిన 30 ఏళ్లకి ప్రసాదించిన కాంగ్రెస్ పార్టీ కూడా దేశ ద్రోహులని ప్రోత్సహించే పార్టీగా భావించాలి.