Thursday, 19 May 2011

R. Ravindranath: ప్రత్యెక రాష్ట్రం ఎవరికి కావాలి?

R. Ravindranath: ప్రత్యెక రాష్ట్రం ఎవరికి కావాలి?: " రాజకీయ నిరుద్యోగులకు మరియు పైరవికారులకు వారితో పాటు విధులు ఎగ్గొట్టి కాలక్షేపం చేయాలనుకోనేవారు , 40 సంవత్సరాలు దాటినా చదువు పేర..."

Tuesday, 10 May 2011

ప్రత్యెక రాష్ట్రం ఎవరికి కావాలి?

 రాజకీయ నిరుద్యోగులకు మరియు పైరవికారులకు వారితో పాటు విధులు ఎగ్గొట్టి కాలక్షేపం చేయాలనుకోనేవారు, 40 సంవత్సరాలు దాటినా చదువు పేరుతొ ప్రభుత్వాన్ని అడ్డంగా దోచుకొంటూ  పందికోక్కులవలె  ప్రజల  సొమ్ము  స్కాలర్షిప్  రూపంలో  అప్పనంగా  మేస్తూ ఏ  విధమైన పనిపాటాలేక యూనివర్సిటీల్లోని  విద్యార్ధి నాయకులు ఈ ఉద్యమానికి ఊపిరి. వీరికి కొంతమంది ప్రొఫెసర్లు (వీరు ఏ రోజూ పాఠం చెప్పరు. ఎవరికి సక్రమంగా పీ హెచ్ డీ చేయించలేరు)వంతపాట  పాడుతున్నారు.  ఎంతోమంది విద్యార్థులు తమ  చదువులు పూర్తవగానే లేదా తాము   చేరిన కోర్స్ పూర్తీ  అవగానే ఉద్యోగం కోసం లేదా తమ తమ వ్యాపారాల కోసం వెళ్ళిపోతారు. కానీ ఈ వయోవృద్ధ విద్యార్థులు యునివర్సిటీలని మర్రి చెట్టు మీది గబ్బిలాల మాదిరి వదలకుండా అక్కడే ఉండి అమాయకులని రెచ్చగొట్టి వారిని ఆత్మహత్యలకు ప్రేరేపించే విధమైన ప్రకటనలు గుప్పిస్తూ ఉంటారు. మన తెలంగాణా నాయకులు ఎవరైతే ప్రత్యెక రాష్ట్రం కావాలని  కోరుతున్నారో  ఒక్కసారి  అవలోకిస్తే   రాజకీయ  నిరుద్యోగులు,  ప్రతిపక్ష నేతలు, ఒక  వేళ  అధికార  పార్టీలో ఉన్నా ఎమ్మెల్యేలు కాలేక పోయినవాళ్ళు, ఏమ్మేల్యేలైనప్పటికి మంత్రి పదవులు దక్కనివాళ్ళు, ఒక వేళ మంత్రి పదవి దక్కినా తమ స్థాయికి  తగదని  అలిగినవాళ్ళు  వీళ్ళందరి  ప్రోద్బలంతో  ప్రజలను  రెచ్చగొట్టిన వాళ్లు, ఒక వేళ ప్రత్యెక రాష్ట్రాన్ని  సమర్ధించకపోతే  ఎక్కడ  తెలంగాణా  వచ్చాక  తమని  వెనక్కు  తోసేస్తారనే  భయంతోనూ ఉద్యమాన్ని నడుపుతున్నారు. వీళ్ళకి తోడు ఏ రోజూ వీళ్ళకు స్వతంగా పాట తప్పులులేకుండా రాయలేని కవులు, గాయకులు మరియూ వాచాదోషాలతో తప్ప పాడలేని గాయక, గాయకీమణులు వారితో పాటుగా అరుపులు, పెడ బొబ్బలుతో కోతిగంతులు వేయందే పాడలేని గాయక శిఖామణులు, తమ స్వార్థంకోసం ఎవరు బలి అయినా ఫర్వాలేదు కానీ తమని నమ్ముకొన్న, తమకు ఆర్థికంగా సహాయపడే మావోఇస్టులకు కాలిలో ముల్లు దిగితే చాలు గోల గోల చేసే  పౌర  హక్కుల  (హరణ) సంస్థల వాళ్లు తప్పితే ఇంకెవరి మద్దతూ లేదు.