Thursday, 10 November 2011

మారుతున్న వేషధారణ

నా చిన్నతనంలో మా అమ్మ, మా అమ్మమ్మ, నాయనమ్మ గారలు పాడె జానపద గేయాలలో ధర్మ రాజుని దారిద్ర్య దేవత ఆవహించ బోయే ముందు ఆయనని ఆవహించి, పీడించలేనని ఏడుస్తుంది. అందులో కొన్ని చరణాలలో ఈ విధంగా పాడుతూ ఏడుస్తుంది. నట్టింటి చిట్టూక తోక్కడే రాజూ, చాకటింటీ బట్ట కట్టడే రాజూ, ఆ ధర్మ నందనుని నే చేరలేనే. ఇది జానపద గీతం. సరే. కానీ మా పెద్ద తాతయ్యగారు చాకలి వాళ్లు ఉతికి తెచ్చిన బట్టలని కట్టేవారు కాదు. చాకలికి వేసిన తరువాత వాటిని ఇంట్లో మళ్లీ తడిపించి ఆరిన తరువాతే ఆయన ధోవతీని కట్టేవారు. అలాగే మా తాతగారు బియ్యే బియ్యీడీ చదివి మార్టేరు ఉన్నత పాఠశాలలొ పనిచేసి కూడా ఒకసారి కట్టి విడిచిన పంచెని మళ్లీ ఉతికి, చలువ చేసేవరకూ కట్టే వారు కాదు. నేను ఈ చెప్పే మాటలు ఒక్క మా కుటుంబం లో మా పితామహులే కాదు. మా స్వగ్రామం పెద్దేవంలోనూ మరియూ ఆ చుట్టుపక్కల గ్రామాలలో చాలామంది ఆ విధంగానే ఉండేవారు.


వారి తరువాత తరాలలోని వారికి ఫేషన్లు ఎక్కువయి పొడుగు లాగులు (trousers), పొడుగు లేదా పొట్టి చొక్కాలు (full sleaves and bush shirts) వేసుకొనే వారు. అంటే మా నాన్న గారు, ఆయన సోదరుల తరంలోని వాళ్ళన్నమాట. వాళ్లు తమ బట్టలని చాకలికి వేసి ఇస్త్రీ చేసిన బట్టలనే వేసుకొనే స్థాయికి వచ్చారు. మా స్వగ్రామం లో మా ఇంటి రజకుడి పేరు కిష్టి గాడు. అతనికి, తన ఆర్ధిక స్థోమత లేక బనీను వేసుకొని తిరిగేవాడు. అందుచేత ఊళ్ళో ఎవరైనా బనీను వేసుకొని కూర్చొంటే ఏమిట్రా చాకలి కిష్టిగాడి లా జబ్బాల దాకా బనీను వేసుకొని కూర్చోన్నావు అనే వారు. ఆ రోజులలో మా నాన్న గారు వాళ్ళూ పంట్లాములు లూజుగా ఉండేవి వేసుకొనే వారు. వాటి తో పాటుగా ఫుల్ సూట్లు ఉండేవి. మీకు బాగా అర్థమవ్వాలంటే, తోడికోడళ్ళు చిత్రంలో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు లేదా మిస్సమ్మ చిత్రంలో శ్రీ నందమూరి తారక రామారావు గారు, నాగేశ్వర రావులు ధరించిన లాగులు లాంటివన్నమాట. ఆ తరువాత అరవయ్యో దశకం మధ్యలో గొట్టాం (నేరో కట్) పాంట్లు వచ్చాయి. అవి చాలా కాలం రాజ్యమేలాయి.

ఆ తరువాత మా తరంలోని వాళ్ళం కూడా పొడుగు లాగులూ చొక్కాలే వేసుకొనే వారం. అందులోనే చాలా రకాలు వచ్చాయి. డెబ్భయ్యవ దశకం మధ్యలో గొట్టాం పాంట్లు పోయి బెల్ బాటం పాంట్లు వచ్చాయి. ఇవి కూడా చాలాకాలం రాజ్యమేలాయి. అనగా నేను కాలేజీలో చదివే రోజులలో ఈ బెల్ బాటం లు ఫేషన్.

అంతకుముందే అంటే అరవయ్యవ దశకం మధ్యలో అంటే నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే మన దేశం లోని కి హిప్పీలు, యప్పీలు దిగుమతి అయ్యారు. వారి విచిత్ర వేషధారణ ఏమిటంటే ఒక దేవతా వస్త్ర రాజాన్ని ధరించేవారు. ఆ వస్త్ర రాజమే జీన్స్ పాంట్. అది టెంట్ లకి వాడే ఒక మొద్దు కేన్వాస్ గుడ్డ. అంటే మనము వేసుకొనే కేన్వాస్ బూట్ల గుడ్డ అని కూడా చెప్పవచ్చు. అది చాలా కాలం మన దేశం లో పెద్దగా పాపులర్ కాలేదు కారణం దాని కథా కమామిషు వింతగా ఉండడమే కాకుండా దానితో లాగులు కుట్టడం మన దర్జీలకి వచ్చేది కాదు. చాలా వరకూ బజార్ లో దొరికే జీన్స్ పాంట్లు అన్నీ ఎక్కడో తయారయి మనకి దిగుమతి అయ్యాఎవి ఆ తరువాత మన దేశం లోని దర్జీలు తమ కుట్టు యంత్రాలని ఈ కాన్వాస్ గుడ్డతో పొడుగు లాగులు కుట్టడం చేసినా చాలా మంది వాటిని హీనంగానే చూసేవారు. ఎందుకంటే వాటిని తడపడానికి కానీ, ఇస్త్రీ చేయడానికి కానీ వీలుండేది కాదు.

అసలు ఈ జీన్స్ పాంట్ గని కార్మికులకి, ఇతర శారీరక శ్రమతో కూడుకొన్న కార్మికులు ఎక్కువగా వేసుకొనేవారు. వాటి మన్నిక మరియూ ఉతకవలసిన అవసరం లేదు కారణం దానిని ఉతకడమంటే oka బ్రహ్మ యత్నం గా భావించేవారు. నేను కాలేజీలో చదువుకొనే రోజులలో ఎవరైనా జీన్స్ పాంట్ వేసుకొని వస్తే వాడిని చాలా చిన్న చూపు చూసే వాళ్ళం. పాపం ఎక్కువ బట్టలు కొనలేని స్థితిలో ఉన్నాడు కనుకనే ఆ మొద్దు గుడ్డ తో కుట్టిన పాంట్ కొనుక్కోన్నాడని భావించే వారము. ప్రస్తుతం ఆ జీన్స్ అనేక రకాల ఆకారాలు మారి, చిరుగుల జీన్స్, కిటికీల జీన్స్, వెలిసిపోయిన జీన్స్ అని రకరకాలు మన అంగళ్ళలో దొరుకుతున్నాయి. వీటిని ఉతకాల్సిన అవసరం ఉండదు. ఎక్కడ పడితే అక్కడ డేకవచ్చు. ఆ విధంగా ఈ జీన్స్ అనే దేవతా వస్త్రం వేసుకొని డేకడమే అంతే కానీ దానిని ఉతికి ఆరేసే వాళ్లు చాలా తక్కువమంది. నేనయితే ఒక వస్త్రాన్ని ఉతకడం అనేది ఒక పంచవర్ష ప్రణాళిక తరువాతే జరగడం వలన ఏ రోగాలు వస్తాయో నని భయపడి చస్తూ ఉంటాను. అంతే కాదు. నేను ఇంతవరకూ ఒక్క జీన్స్ పాంట్ కూడా వేసుకోలేదు.


ఎనభయ్యవ దశకంలో ఇంకొక వస్త్ర రాజం వచ్చింది. అది నేను ఇంతకుముందు చెప్పిన మా చాకలి కిష్టిగాడు తొడుక్కొనే బనియన్. దాని పేరే టీ షర్ట్. ఇంక ఈ టీ షర్ట్ అంటే లోపల బనియన్ వేసుకొనే అవసరం ఉండదు ఎందుకంటే వీళ్లు మా చాకలి కిష్టి గాడి లాగా జబ్బాల దాకా బనియన్ వేసుకొని తిరగడమే కారణం. ఆ టీ షర్టు లేదా మా చాకలి కిష్టిగాడి బనియన్ వేసుకొన్న వాళ్లని చూస్తే నాకు ఒక్కో సారి వాళ్ల మీద జాలి కలుగుతుంది. కారణం పేద వాడి గుడ్డని కూడా వీళ్లు జీన్స్ మరియూ టీ షర్ట్ పేరుతొ లాక్కొన్నారు అని. ఈ చాకలి కిష్టి గాడి జబ్బల బనియన్ మరియూ రాళ్లు కొట్టే వారి ముతక గుడ్డ పాంట్ లని అమ్మాయిలూ మరియూ వారి తల్లిదండ్రులు తొడుక్కోవడమే కాకుండా తమ యొక్క భావదారిద్ర్యాన్ని పదిమందికీ చూపిస్తున్నారు. ఫేషన్ పేరుతొ అమెరికా వారు ఈ విధంగా సొమ్ము చేసుకొంటున్నారు.

ఈ విధంగా మారిన మగవారి వేషధారణ మారి పోయి కనీసం ఒక్క చాకలి కిష్టిగాడి బనియన్ మరియూ జీన్స్ ప్యాంటు లేని వారిని చిన్న చూపు చూసే రోజులు వచ్చాయి. అమ్మాయికి లంగా, ఓణీ లేదా సల్వార్, కమీజ్  లు  లేకపోయినా ఫరవాలేదు కానీ ఆ దేవతా వస్త్రాలు కనీసం ఒక్క జత అయినా ఉండాలని కోరుకొనే తల్లిదండ్రులు ఈ దేశంలో చాలామందే ఉన్నారు.


ఇంక ఈ వేషధారణ ఏయే పోకడలు పోనున్నదో ఎవరికి ఎరుక.

(ఇందులో రజకుల కుల ప్రస్తావన ఉన్నది. అది కావాలని వారిని అవమానించేందుకు రాసినది కాదు.  ఒక వేళ తెలియక నొప్పిస్తే క్షమించ ప్రార్థన).

Tuesday, 8 November 2011

సంస్కృత సుభాషితం: తెలంగాణావాదం

సంస్కృతంలో చెప్పిన ఈ కింది శ్లోకం ఒకటి ఎప్పుడో చిన్నపుడు చదువుకొన్నాను కానీ నేటి తెలంగాణా వాదాని కి సరిగ్గా సరిపోతుంది అది:
దుర్బలస్య బలం రాజా బాలానాం రొదనం బలం |
బలం మూర్ఖస్య మౌనిత్వం చౌరాణాం అనృతం బలం ||

పైన చెప్పిన సుభాషితం మన తెలంగాణా వాదులకి సరిగ్గా సరిపోతుంది. ఎలాగంటే:

1.దుర్బలస్య బలం రాజా:
దుర్బలులకు రాజే బలాన్ని ఇస్తాడు అని అర్థం. ఈ తెలంగాణా వాదులు, వారికి ఏమీ కాదు అనుకొన్న సమయంలో గ్రామ సింహాలు కూడా ఏదో పెద్ద పులులం అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. అదే వీరి తప్పుడు పనులకి పోలీసులు కనుక చర్యలు తీసుకొంటే వెంటనే వీరికి స్వయం ప్రతిపత్తి కలిగిన వీరికి తల్లిలాంటి మానవ హక్కుల సంఘం గుర్తుకు వచ్చి దాని చీర చెంగులో దాక్కొని తమ మీద పెట్టిన కేసులని తీయిన్చేసుకొనే ప్రయత్నం చేస్తారు. అంటే వీళ్లు మానసికంగా దుర్బలులు అందుచేతనే వేరే వారికి కంప్లెయింట్ చేస్తారు.అనగా ఈ దుర్బలులకి వారి తల్లి లాంటి మానవ హక్కుల సంఘం బలం.

2.బాలానాం రొదనం బలం:
చంటి పిల్లలకి నోరు ఉండదు. అందుచేత వారికి ఏది కావాల్సి వచ్చినా ఏడ్చి సాధిస్తారు. మన తెలంగాణా వాదులకి ఏడవడం బాగా వచ్చునని మన అందరికీ బాగా తెలిసినదే. అదే వీరి బలం. ప్రతీ దానికి ఏడుపే. ఎదుటివాడు సంపాదించాడు అని ఏడుపు. బాగుపదిపోయాడని ఏడుపు. ఈ ఉద్యమం పుట్టి ఆరు సంవత్సరాలు మాత్రమె అయ్యింది. ఆ విధంగా రకరకాలుగా ఏడ్చి తెలంగాణా కు అనుకూలంగా ఒక దొంగ ప్రకటన ప్రకటన ఇప్పించుకొన్నారు. కాబట్టి వీరికి ఈ బాలానాం రొదనం బలం అనే నానుడి సరిగ్గా సరిపోతుంది.

3.బలం మూర్ఖస్య మౌనిత్వం:
మూర్ఖుడితో వాదించడం కన్నామౌనంగా ఉండడమే బలం అని అర్థం. ఈ తెలంగాణా వాదులకి మూర్ఖత్వం కూడా ఎక్కువే. ఒక సారి అభివృద్ధి జరగలేదు అంటారు. అది కాక పొతే మీరు మా ఉద్యోగాలు, నీళ్లు, నిధులు పదవులు అన్నీ దోచేసారని అంటారు. ఒకసారి ఆత్మ గౌరవం అంటారు. ఇంకొక సారి మమ్మల్ని మేము పరిపాలించుకొంటాం అంటారు. ఇంకొక సారి తెలంగాణా మా నాలుగో నలభయ్యో కోట్ల ప్రజల ఆకాంక్ష అంటారు. ఇవన్నీ అయిన ఆతరువాత మా తెలంగాణా మాకు కావాలి అని మూర్ఖవాదానికి దిగుతారు. ఆ మూర్ఖవాదానికి ఎవరూ సమాధానం చెప్పలేరు. అందుచేత ఆ మూర్ఖ వాదం మొదలయినప్పుడు మనం మౌనం వహించడమే మన బలం. ఎందుకంటే వీళ్లు కొంత సేపు అరిచి గొంతు నొప్పి పుట్టి వాళ్ళే చల్లబడి ఊరుకొంటారు.

4.చౌరాణాం అనృతం బలం:
దొంగకి అబద్ధం చెప్పడమే బలం. మనం న్యాయమంగా చూస్తే ఈ తెలంగాణా వాదులు కోస్తా, రాయలసీమ వాసుల ఉద్యోగాలని తమ జనాభా యొక్క దామాషా కన్నా ఎక్కువగా అనుభవిస్తూ ఎదుటివారు తమని దోచుకోన్నారని ప్రచారం చేస్తారు. వీరి నాయకులు ఒకరు దొంగ సర్టిఫికేట్ లతో విదేశాలకి పోయే మహా నాయకుడు. ఒకరు ప్రజల ను బెదిరించి వారి సొమ్ములని దోచేసే మహా నాయకులు. మరొకరు హైదరాబాద్ నగరంలో ఖాళీ కనిపిస్తే చాలు తనవారితో గుడిసెలు వేయించిన మహానుభావుడు ఇప్పుడు కాటికి కాళ్లు చాపుకొన్న పర్స్తితిలో ఎదుటివారిని తప్పు పడతారు. ఒక ఆయన చేసేవన్నీ దొంగ దీక్షలే. అబద్ధాలే తప్ప ఏ రోజూ నిజం చెప్పనని ఒట్టు పెట్టుకొన్న పార్టీ కి నాయకుడు. ఒక ఎమ్మెల్యే గారు ఎదుటపడి దాడి చేయలేక దద్దమ్మలా తన గూండాని కారు డ్రయివర్ అని చెప్పి వెనక నుండి కొట్టించే ప్రబుద్ధుడు. ఇన్ని దొంగతనాలు దొంగ పనులూ చేసి తాము పాలలో స్నానం చేసామన్న రీతిలో వ్యవహరిస్తూ ఉంటారు. అంటే చౌరాణాం అనృతం బలం నిజమనే కదా.