కొన్నాళ్ల క్రితం వరకూ మధ్య తరగతి తెలుగు వారు మగవారు ఇంట్లో ఉంటె పాంట్లు వేసుకొంటే సుఖంగా ఉండదని నైట్ డ్రెస్ అంటే లుంగీలు కట్టుకొనేవారు. లుంగీలని గోదావరి జిల్లాలో లుంగీ పంచె అని పిలుస్తారు. ఈ లుంగీ పంచె అనే పదాన్ని పట్టుకొని నన్ను నా భార్య, నా పెద్ద బావమరిది వెక్కిరించెవారు. ఆ తరువాత నా బావమరిది కూడా గోదావరి జిల్లాలో పెరిగిన పిల్లని పెళ్లి చెసుకొన్నాడు . ఆ అమ్మాయి కూడా ఆవిధంగానే లుంగీ పంచె అనేసరికి నా గోదావరి యాసకి కాస్త తోడూ దొరికినట్లై ఆ అమ్మాయి, నేను నా భార్యని, బావమరిదిని కృష్ణా జిల్లా యాసని వెక్కిరించేవారం. ఆ తరువాత కొద్ది కాలానికి లుంగీలు పోయి లాల్చీ పైజామాలు వచ్చాయి. ఆ తరువాత వాటి ఖరీదు ఎక్కువ అవడం తో అమెరికా నుండి కొత్తగా దిగుమతి ఐన చెడ్డీలు రాజ్యమెలుతున్నాయి. ఈ చెడ్డీలని ముద్దుగా బెర్ముడాస్ అని పిలుస్తున్నారు.
మానవుడి తొడలు అప్పుడప్పుడు మిగిలిన అంగాలు కనిపించే విధంగా ఉండే ఈ చెడ్డీలు/బెర్ముడాస్ మన భారతీయులకి కొత్తవి కాదు. మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నిక్కర్లు వేసుకోనేవారం. ఆ తరువాత ఇంటికి వచ్చాక మళ్లీ మరియొక నిక్కర్ తొడుక్కొని వాటిని మార్చేవారం. కానీ మా చుట్టాల్లో ఒక కుటుంబం వారు పిల్లలు స్కూళ్ళ నుండి ఇంటికి తిరిగి వచ్చాక చారల చెడ్డీలు ధరించి కూర్చొనే వారు. అటువంటి ఇంకొక చెడ్డీ మా మామయ్యా గారూ తొడుక్కొని కూర్చొనే వారు. మేము నవ్వెవాళ్ళం వాళ్ల ఇంటి డ్రెస్ కోడ్ ని చూసి. కానీ ఆ రోజులలోని చెడ్డీల సంస్కృతి అమెరికా పుణ్యమా అని మళ్ళీ గత పది, పదిహేను సంవత్సరాల నుండి ఈ చెడ్డీ వీరులని చూస్తూ ఉంటె నా చిన్నతనం గుర్తుకు వచ్చి నవ్వు వస్తూ ఉంటుంది. నాకుగా మాత్రం ఇంటిలో ఉన్నప్పుడు లుంగీలోనే హాయి ఉన్నదనిపిస్తుంది.

No comments:
Post a Comment