Saturday, 24 September 2011

అసలు తెలంగాణా రాష్ట్రము ఎందుకివ్వాలి?

ప్రతీ వేర్పాటువాది, తెలంగాణా ఎందుకు కావాలో నేను వంద కారణాలు చెబ్తాను అని పెద్ద పోటుగాడిలా చెడ్డీ కట్టుకోవడం రాని వాడు కూడా మాట్లాడేవాడే. కానీ సరియైన కారణం వాళ్లు చెప్పరు, వాళ్లకే తెలియదు. ఇది ఎలా ఉందంటే, చిన్న పిల్ల వాడు చాక్లెట్ కొనివ్వకపోతే చేసే ఆగం కన్నా అధ్వాన్నంగా చేస్తున్నారు. ముందు నీళ్ళ, నిధుల, విద్య, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలలో మేము అందరికన్నా వెనకబడిపోయాం అని ఏడ్చి రాగాలు తీసారు. తరవాత, ఆ ఏడుపులు అన్నీ అబద్ధం అని ఋజువయ్యేసరికి మీరు మా భాషని, మా సంస్కృతిని అవమానించారు అన్నారు. అది కూడా ఎవరూ నమ్మక అబద్ధాలు చెబుతున్నారని తెలిసాక, తమ బండారం బయటపడి పోయిందని తెలిసి ఆత్మ గౌరవం, స్వయం పరిపాలన అనడం మొదలు పెట్టారు. స్వయం పరిపాలన అంటే మిమ్మల్ని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే సీమాంధ్రులు అంటారు. కానీ మంత్రి వర్గంలో ఉన్నవాళ్ళు ఒక్క సీమంద్రులే కాదు కదా. తెలంగాణా వారు సింహ భాగాన్ని అనుభవిస్తున్నారు కదా. అంటే ఈ తెలంగాణా మంత్రులు ఎవరూ తెలంగాణా తల్లి దండ్రులకు పుట్టలేదా అని నాలాంటి అమాయకుడు ప్రశ్నిస్తే, నువ్వు ఆంధ్రా వారి అహంకారం తో మాట్లాడుతున్నావు అని నా మీద దాడి చేస్తారు. అంతే కాకుండా మా భావాలని గాయపరిచావు లేదా మా ఆత్మాభిమానాన్ని అవమానించావు అని యుద్ధం ప్రకటిస్తారు.

అంటే, వీళ్లు అన్ని వాదనలలోనూ ఓడిపోయాక తెలంగాణా, మా అరవయ్యేళ్ళ కల లేదా ఆకాంక్ష, మా జన్మ హక్కు అని మొదలు పెడతారు. దానికి సమాధానంగా సీమాంధ్రుల కల తెలంగాణా 10 రాష్ట్రాలుగా విడిపోవాలని లేదా ఎవరో ఒక వ్యక్తిని మర్డర్ చేయాలనీ నా చిన్నప్పటి కల అంటే ఒప్పుకొంటారా? ఈ ప్రశ్న అడిగినందులకు నన్ను ఎన్ని బూతులు తిడతారో బెదిరింపులు ఇస్తారో ఆ భగవంతునికెరుక. వీళ్ళ అన్యాయమైన కోరిక కోసం ఎన్ని కుయుక్తులు పన్నాలో అన్నీ పన్నారు. ఒకటి కేంద్రంలో కనబడిన ప్రతీవాడికి మా తెలంగాణా మాకు ఇప్పించండి అని వాళ్లని బతిమిలాడారు. కానీ పార్లమెంట్ లో గత సమావేశాలలో బీ జే పీ వారితో కలిసి ప్రైవేట్ బిల్లు పెట్టినప్పుడు పీ సి సర్కార్ చేసే జాదూటోనా లాగా అసలైన తెలంగాణా గాంధి శ్రీ కచరా గారు మాత్రం పార్లమెంట్ లో మాయం . అసలు పార్లమెంట్ లో ఈయన మాట్లాడినది ఏమైనా ఉందా? సిని హీరోలు హీరోయిన్లను ఫోటో సెషన్ కి సినిమా రిలీజ్ కి ముందు వెళ్లినట్లుగా ఒకసారి పార్లమెంట్ కి వెళ్లి మీరా కుమార్ దగ్గర లోక్ సభ వెల్ లో నిల్చొని తన దశమ సోదరి అనబడే విజయశాంతి గారు అక్కడ తన అభినయ కౌశలముతో బంగారు నెమలి వచ్చేట్లుగా దుఃఖించి వచ్చారు. ఆ తరువాత మన దొర వారు మళ్లీ పార్లమెంట్ లో కనబడితే ఒట్టు.

అలాగే, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో తెలంగాణా కాంగ్రెస్ నాయకులు తమ తెలంగాణా వాదాన్ని వినిపించడానికి పార్లమెంట్ లో సిద్ధపడి, ప్రతిపక్ష పార్టీ బీజేపీ నేత తో తప్పుల తడక గా తమ వాదాన్ని వినిపింప చేసినందులకు ఆవిడకి సభా హక్కుల నోటీసు ఇచ్చారు అది వేరే విషయం. ఆ సమయం లో మా వెలమ దొరవారు తమ దొరతనం చూపిస్తూ ఇక్కడ హైదరాబాద్ లోనో లేదా కరీంనగర్లోనో విశ్రాంతిని ఆస్వాదించారే కానీ పార్లమెంట్ గుమ్మం తొక్కితే తూ నా బొడ్డూ గా వ్యవహరించి, ప్రస్తుతం తన ఇంటి పాలేరులా వ్యవహరించే ఆచార్యవర్యులు తో కలిసి సకల జనుల సమ్మె పేరుతొ ప్రజలని ఇబ్బందులలోకి నెట్టివేసి ఆనందం అనుభవిస్తూ, వచ్చే ఉప ఎన్నికలలో పోచారం చేత నామినేషన్ వేయించడమే పనిగా పెట్టుకొన్నారు. అంతే కాకుండా మిగిలిన పార్టీల వారెవరూ నామినేషన్ వేయకుండా తమదైన శైలిలో గూండాయిజం చేస్తున్నారు. చెప్పేవి శ్రీ రంగనీతులు అన్న చందంగా ప్రవర్తిస్తూ తమ మాటకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని తెలంగాణా ద్రోహులు అని ఏదో అచ్చోసిన ఆంబోతులా మీద వేసినట్లు గా ముద్ర వేస్తూ ప్రజలని కాల్చుకు తినే వారిని ఎందుకు నమ్మాలి? ఏమని నమ్మాలి?

నిన్ననే మన ఆచార్య పుంగవులు మిలిటెంట్ తరహాలో శాంతియుతంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటన ఇచ్చారు. మిలిటెంట్ ఉద్యమం అంటే మన అల్లం నారాయణ గారు నమస్తే తెలంగాణా దిన పత్రికలో తమ ఎడిటోరియల్ లో రాసినట్లుగా సీమాంధ్రలోని ముడ్డి కడుక్కోవడం రాని బుడ్డోడు కూడా అర్థం చెబుతాడు. ఇంతకీ మిలిటెంట్ తరహా ఉద్యమం శాంతియుతంగా ఎలా చేస్తారో మన ఆచార్య పుంగవులు ముద్దసాని కోదండ రామ రెడ్డి గారు, శ్రీ కచరా గారు వారి పార్టీ సభ్యులు, వారితో ఖమ్మంలో వేదిక పంచుకొన్న మాననీయ భారతీయ జనతా పార్టీ వారితో పాటు, వారికి జన సమీకరణకు తమ వంతు ఉడతా భక్తి గా ఇతోధికంగా ప్రజలని సభకి తోలుకొని వచ్చిన అత్యంత దేశ భక్తులు అప్పుడప్పుడు మాత్రమె తమకు లొంగని వారిని, తమకు ఎదురు చెప్పినవారిని ప్రజా కోర్టులు నిర్వహించి వారి తలల్ని న్యాయంగా నరికివేసే పుణ్య మూర్తులు అయిన నక్సలైట్ నాయకులు బాగా విడమరచి చెప్పగలరు. వీరంతా కలిసి తెలంగాణా ఉద్యమం పేరుతొ ప్రజల జీవితాల్ని అస్తవ్యస్తం చేసేసారు. వీరికి తోడు సత్రకాయలాంటి తెలంగాణా కాంగ్రెస్ నాయకులు, తెలంగాణా తెలుగు దేశం నాయకులు ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు వాగుతూ ప్రజలని రెచ్చగొడుతూ సాధారణ పౌర జేవనాన్ని దుర్భరం చేస్తే కేంద్రం తెలంగాణా ఇవ్వదని తెలిసీ ఉద్యమాలు చేస్తున్నారంటే ఎంత రాక్షసంగా ఉన్నారో అర్థమవుతోంది. పైగా వీళ్లకి వంత పాడక పొతే మెతుకు దిగనివ్వరని మిగిలిన కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఎంతో పవిత్రంగా భావించే వైద్య సంఘాలు ఇంక ఈ సంఘం ఆ సంఘం అని చెప్పాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల సంఘాల లోనూ ఈ ఉద్యమకారుల కోవర్టులు ఆయా సంఘాల నాయకుల చేత తమదైన శైలిలో తెలంగాణాయే మా ఆశ అని ప్రకటనలు ఇప్పించి వారి నాయకుల చేత సమ్మెలో పాల్గొనడం ఇష్టం లేని వారిని కూడా పాల్గోనేట్టు చేసి చేయక పొతే తమ బాహు బలం తో వారికి బద్ది చెప్పగాలవారే ఈ ఉద్యమానికి సారధులు.

ఇన్ని అకృత్యాలు చేసే వారికి రాష్ట్రం ఇస్తే ఎలా ఉంటుందో ఇప్పుడే సాంపిల్ గా రుచి చూపిస్తున్నారు. ఇంత చేసినవారికి తెలంగాణా ఇస్తే మామూలు ప్రజల గతి అధోగతే.

Sunday, 18 September 2011

సినిమా రికార్డింగ్ డాన్సులుని మించిపోయిన నేటి టీవీ నాట్య పోటీలు

ఇప్పుడే తీన్ మార్ అని ఒక నాట్య కార్యక్రమం జీ టీ వీలో చూసాను. అది చూసాక, ఇంతకు ముందు కొన్ని టీవీ నాట్య కార్యక్రమాలని మా, జెమిని, ఈ టీవీ ఇంకా కొన్ని నేషనల్ చానెల్స్ అయిన సోనీ, జీ, స్టార్ వంటి ప్రైవేట్ చానెళ్ళలో చూసిన తరువాత ఈ బ్లాగు రాయాలని అనిపించింది.

నా చిన్నతనం లో ఏదైనా పండుగలు, సంబరాలు, తీర్థాలు లేదా జాతరలు జరిగినప్పుడు ఆ జాతరలలో లేదా నవరాత్రుల ఉత్సవాలలో ఒక రోజు లేదా రెండు రోజులు సిని రికార్డింగ్ డాన్సులు పెట్టేవారు. ఆ విధంగా సినీ రికార్డింగ్ డాన్సులు చేసే సంస్థలు కొన్ని కాస్త పెద్ద పట్టాణాలయిన రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు భీమవరం లాంటి పట్టణాలలో ఉండేవి వాళ్ళు వచ్చి వేదిక మీద సినిమా పాటలకు తగ్గట్లుగా నాట్యం చేసేవారు. ఆ విధంగా వాళ్ళు తాము బతకడమే కాక తమ మీద ఆధార పడ్డ కుటుంబాలనూ పోషించుకోనేవారు. ఇంతా చేస్తీ వాళ్ళు తీసుకొనే మొత్తం చాలా తక్కువ. రాను, రాను ఈ సినీ రికార్డింగ్ డాన్స్ ల్లో అశ్లీలం ఎక్కువయ్యేసరికి వాటిని నిషేధించారు. దాని వలన చాలా మంది రికార్డింగ్ డాన్స్ కళాకారులకి ఉపాధి పోయింది వాళ్ళు వేరే వృత్తులని చేపట్టడానికి ప్రయత్నించి అందులో సఫలీకృతులు కాలేక వేరే పని ఏదీ చేత కాక అత్యంత దుర్భర హైన్య జీవితాలు అనుభవిస్తున్నారు. అది వేరే విషయం.

మన రాజ్ న్యూస్ లేదా టీ టీవీ వారు కోస్తా ప్రాంతంలో సినీ రికార్డింగ్ డాన్సులు చేసారని కొన్ని నెలల క్రితం వార్త ని ప్రసారం చేసారు. ఆ టీవీ వారిని నేను తప్పు పట్టను ఎందుకంటే సినీ రికార్డింగ్ డాన్సులు నిషేధం. అందుచేత వారు దానిని విమర్శనాత్మకంగా ప్రజలలో చైతన్యం కోసం ప్రసారం చేసారు.

ఇంక ప్రస్తుత విషయానికి వస్తే, మన టీవీ కార్యక్రమాలలో వచ్చే నాట్య పోటీల కార్యక్రమాన్ని చూస్తే ఆ పోటీలు పెట్టిన వారిని నిలువునా చీరేయాలని ఎవరికైనా అనిపిస్తుంది . పూర్వం పొట్టకూటికోసం తప్పక గత్యంతరం లేక సినీ రికార్డింగ్ డాన్స్ లు చేసేవారు. కానీ టీవీ పోటీలలో దానిని మించి పోయి సభ్య సమాజం సిగ్గుతో అసహ్యించుకొనే విధమైన వేషధారణ, దానితో పాటుగా భార్యా పిల్లలతో చూడలేని విధంగా చిన్న పిల్లలు లేదా కాస్త పెద్ద వయసు పిల్లలు చేసే కామకేళీ విన్యాసాలు. ఆ చిన్న పిల్లలు చేసే వాత్స్యాయన కామ భంగిమల్ని చూసి చొల్లుకార్చుకొనే న్యాయనిర్ణేతలు. అంతే కాకుండా ఇంక ఆ కార్యక్రమాన్ని నిర్వహించే వ్యాఖ్యాతల దుస్తుల్ని చూస్తే కాస్తలో కాస్త మగ వ్యాఖ్యాతల వేషధారణ నయం కానీ ఆడవారి వేషధారణని చూస్తే అప్పుడే పడకటింటిలో కామకేళి ముగించి పొరబాటున అదే వేషధారణ తో బయటకు వచ్చిన వనితని మరిపిస్తూ, చూసే వారిని కవ్విస్తూ చేసే వ్యాఖ్యానాలు పరమ రోతగా ఉన్నయని చెప్పక తప్పదు. ఈ కార్యక్రమాలని చూడడానికి వచ్చిన ప్రేక్షకులు అంతా టీనేజ్ పిల్లలు మరియూ వారి తల్లిదండ్రులు. వాళ్లు ఈ కార్యక్రమాన్ని ఒళ్లు కొవ్వెక్కి, తిన్నది అరగక ఒక్కసారిగా తమ పిల్లలు పేరు ప్రతిష్టలు తెచ్చేసుకొని గొప్పవారైపోవాలని తమ పిల్లలని ఈ కార్యక్రమాలలో పాల్గొనేందుకు వారిని ప్రోత్సహిస్తూ, వాళ్లకి కామకేళి విన్యాసాలలో తాము తీర్చుకోలేని భంగిమలు నేర్పిస్తున్నారే తప్ప ఏవిధమైన కళకూ న్యాయం చేయడం లేదు. ఈ కార్యక్రమాలలో పాల్గొని కప్పులు సాధించడానికి పిల్లలకు, పెద్దలకు తర్ఫీదు నిచ్చే శిక్షణా సంస్థలు కూడా ఉన్నాయి అంటే ఆశ్చర్య పోయాను. ఈ విధమైన సినీ రికార్డింగ్ డాన్సులు పూర్వం ఏదో పండగలకి, తీర్థాలాలోనూ చూపించేవారు. కానీ నేడు మన టీవీలలో ఇంచుమించు ప్రతి రోజూ ఏదో ఒక టీవీ చానెల్ ఈవిధమైన్ అశ్లీల నృత్య కార్యక్రమాలు చూపిస్తున్నాయి.

టీవీ చానెళ్లలో చూపించే నాట్య పోటీల కార్యక్రమాలలో అశ్లీల నాట్యాలని నిషేధిస్తూ కొన్ని మౌలిక, న్యాయ, సూత్రాలని, నియమ నిబంధనలని నిర్దేశించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని, మానవ హక్కుల సంస్థల వారిని, సెన్సార్ బోర్డు వారిని మరియూ నేషనల్ టీవీ అసోసియేషన్ వారిని కోరుతున్నాను.

Friday, 16 September 2011

మన సినిమాలలోని శ్రీ రాముడు, కృషుడు పాత్రలకు డోకు వచ్చే రంగు


మన తెలుగు చిత్రాలలో శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు పాత్రధారుల మేకప్ చూస్తే వాంతి వచ్చేలా ఉంటొంది. పూర్వం నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి సమయంలొ రాముడు, కృష్ణుడు పాత్రలు వేసేటప్పుడు నలుపు తెలుపు చిత్రాలలోవారికి వేసిన రంగు తెలిసేది కాదు. కానీ రంగుల చిత్రాలు వచ్చిన తరువాత కూడా వెగటు కలిగించేది కాకుండా కొద్ది మొత్తంలొ మాత్రమె ఆయన నీలం రంగు వెసుకొనేవారు. కానీ, నేటి చిత్రాలలోని పాత్రధారులకు వేస్తున్న నీలం రంగుని చూస్తె అంతర్వెది తీర్థంలొ ముష్టి కృష్ణుడు, పగటి వేషాలు వేసే రాముడుని తలపిస్తూ పరమ రోతగా ఉంటున్నారు. ఈ విషయంలొ స్వర్గీయ తారక రామారావు గారి పుత్రుడు శ్రి బాలకృస్ణ కూడా మినహాయింపు కాదు. నేను ఈ బ్లాగు రాయడానికి కారణం ప్రస్తుతం విడుదలకు నోచుకోబోతున్న శ్రీ రామ రాజ్యం చిత్రం లో శ్రీ బాలకృష్ణ గారి శరీరానికి పూసిన రంగు. అసలు రాముడు లేదా కృష్ణుడు పాత్రధారులకి నీలం రంగు ఎందుకు పూయాలి? నీల మేఘశ్యముడు అంటే నీలం రంగు పరమ రోతగా పూసుకొని తిరగడమేనా? నాకు తెలిసినంతవరకూ శ్రీ రాముడు లేదా శ్రీ కృష్ణుడు ఇరువురూ నీలమేఘులే. నీలము అంటే చామన ఛాయ కంటే కొంచెం రంగు తక్కువ అది నలుపు రంగులొకి వస్తుంది. అంటే ఇరువురూ నల్లని వారే కానీ నీలం రంగు వారు మాత్రం కాదు. దీనికి ఒక ఉదాహరణ ఒక సినిమాలొని పాట లో శ్రీ కృష్ణుడు ని ప్రార్థిస్తూ ' కన్నయ్యా, నల్లని కన్నయ్యా' అని ఉంది. అందుచేత మన సినిమాలలొ ఆ పాత్రలని నీలం రంగుతొ నింపి ప్రజల ప్రాణాలు తీయకుండా ముఖానికి కాస్త మామూలు రంగు రంగు వేస్తే మంచిది. అయ్యా దర్శకులారా మీ దర్శకత్వ పైత్యంతో, అంత డొకు వచ్చే నీలం రంగుతొ మీ నాయకులని నింపవద్దని మనవి.


Thursday, 15 September 2011

తెలంగాణా వాదులు తరచుగా అడిగే వాటిలో కొన్ని ప్రశ్నలకు నా సమాధానాలు

తెలంగాణా వాదులు తరచుగా అడిగే మచ్చుకు కొన్ని ప్రశ్నలకు నా సమాధానం..


3. తెలంగాణ ఇస్తమని చెప్పి మోసం చేయడం తెలంగాణ ప్రజలను వంచించడం కాదా?

కాదు. ఎందుకంటే, ఇక్కడి కాంగ్రెస్ వృద్ధ జంబూకాలు అయినటువంటి కే కే, కాకా, వీ హెచ్ మొదలైనవాళ్ళు సోనియా గాంధి కాళ్ళు ఒత్తి, అమ్మా మనం కేసీఆర్ పీనుగులెక్క రేపో మాపో అన్నట్లుగా ఉన్నాడు ఎప్పుడైనా తులసి తీర్థం నోట్లో పోయాల్సి రావొచ్చు, ఒక వేళ అలా జరిగితే తెలంగాణా మళ్లీ పొట్టి శ్రీ రాములుగారి ఆత్మ సమర్పణ జరిగినప్పటి కన్నా ఎక్కువ గొడవలు జరుగుతాయి అంటే ప్రకటించారు. కానీ మన తాగుబోతు కేసీఆర్ ప్రకటన చేస్తూనే మరునాడు పొద్దున్నే బస్సు యాత్రకి బయలుదేరితే నాకే కాదు బద్ది ఉన్న ఏ వెధవకైనా ఈ వృద్ధ గాడిదలు చెప్పింది అబద్ధం అనిపించదా? నీకు అనిపించకపోవచ్చు ఎందుకంటే నీవు కూడా మీ నాయకుని జాతి వాడివి కాబట్టి. అందుకనే వచ్చే తెలంగాణాని వెనక్కు లాక్కున్నారు. ఇది తప్పు ఎంత మాత్రమూ కాదు. దీనిని ఆంగ్లం లో టిట్ ఫర్ టేట్ అంటారు. అంటే సరి కి సరి అని అర్థం.

6. 85 % స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న నిబంధనను సీమాంధ్ర కంపెనీలు ఎంత వరకు అమలు చేస్తున్నయ్‌..?

అసలు ఉద్యోగాలు కావాలంటూ వలసలు ఎప్పుడు మొదలు పెట్టారు? మీ తెలంగాణా వారు ఏవో జిల్లా ముఖ్య కేంద్రాల లోని వారు తప్ప 2000 సంవత్సరం వరకూ అమ్మ ఒళ్లో కూర్చొని వేడి బువ్వ బొక్కుతూ, విప్లవ గేయాలు పాడుకొంటూ, గద్దర్ లాంటి సన్నాసి వీధి కేబరే డాన్సర్లను పోషించుకొంటూ ఉన్నారే తప్ప ఉపాధి కోసం హైదరాబాద్ మొహం కూడా తెలియదు. అయితే, చేతి వృత్తి చేయడం లేదా నక్సలైట్ల లో కలవడం ఇదే పని. ఇంకొక విషయం నీవు చెప్పిన నిబంధన నీలాంటి సన్నాసుల గురించి ప్రభుత్వ ఉద్యోగాల కు ఉపయోగ పడుతుంది కానీ ఏ కంపెనీ కూడా ఆఖరికి మీ నాయన పెట్టె సంస్థలో కూడా ప్రతిభ లేనిదే, నీ లాంటి సన్నాసులను కూర్చో పెట్టడు.


11. ఆంధ్ర ,రాయలసీమ వలస వాదుల, పెట్టు బడిదారులు తెలంగాణ ప్రాంత సంస్కృతిని , సంపదను కొల్లగొడుతూ ఉంటే వాళ్ల నుంచి విముక్తి పొందాలకోవడం దేశద్రోహమా..?

అంత తుమ్మితే ఊడిపోయే ముక్కా మీ సంస్కృతి? అలాగయితే దానిని సంస్కృతి అనరు. కుసంస్కృతి అంటారు. ఎక్కడ అయితే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయో అక్కడికి ప్రజలు చేరుతారు. కొల్ల గొట్టడం అంటే నీ ఉద్దేశంలో ఏమిటి? బ్రిటిష్ వాళ్లు మన సంపదని తమ దేశానికి తీసుకొని పోయారు. దానిని కొల్లగొట్టడం అంటారు. కానీ మేము సంపాదించినది ఇక్కడే పెట్టుబడులుగా పెట్టి ఇక్కడివారికి, ఇక్కడికి వచ్చినవారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాం. మా పేరు చెప్పుకొని మా కంపెనీ మీద పదిమంది బతుకుతున్నారు. మేము లేదా మా లాంటి వాళ్లు పెట్టుబడులు పెట్టకుండా తగినంత లాభాలు ఆర్జించక పొతే మళ్లీ పెట్టుబడి కోసానికి ఎవరిని దేబిరించాలని నీ ఉద్దేశ్యం?


13. లగడపాటి,కావూరి, సుబ్‌బిరామిరెడ్డి లాంటి దోపిడిదారులు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం సిగ్గు అనిపించడం లేదా?

దీనినే అంటారు మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కింది అని. లగడపాటి, కావూరి, సుబ్బిరామిరెడ్డి గారాలు అంతా కలిసుందాం అని అంటున్నారు కానీ విడిపోతాం అనలేదు. అయినా విడిపోతాం అనేవాడు చిచ్చు పెదాతాడు కానీ కలిసుందాం అనే వాడు ఎలా చిచ్చు పెడతాడో నీలాంటి, మీ కచరా లాంటి, ప్రొ.కొదందండం లాంటి వాళ్లే చెప్పాలి.


14. ఆనాడు భారతదేశానికి స్వతంత్రం ఇయ్యడానికి బ్రిటీషోడు ...ఇంగ్లాండ్ లో ఏకాభిప్రాయం అడిగిండా..?లేకుంటే భారత ప్రజల మహోన్నత పోరాటానికి తలవంచి...పారిపోయిండా..?

ఇది నీ సామాజిక స్పృహ ఎంతో తెలియ చేస్తోంది. వెర్రివాడా, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటిష్ పార్లమెంట్ లో ఒక తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. అప్పుడు Winston Churchill భారత దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వవద్దని వాదించాడు. కానీ పార్లమెంట్ ఆ తీర్మానాన్ని ఆమోదించింది. అంటే ఇంగ్లాండ్ లో ఏకాభిప్రాయం తరువాతే స్వాతంత్ర్యం వచ్చింది. ఈ విషయం నీకు మీ ఉపాధ్యాయులు చెప్పలేదంటే వారి యొక్క జనరల్ నాలెడ్జ్ ఎంతో తెలుస్తోంది. చరిత్ర పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు ఇంత చిన్న విషయాన్ని మీకు అవగతం చేయలేకపోయాడా?


15. మా హైదరాబాద్ రాష్ట్రం గురించి బాలశిక్షలో ఎందుకు ఉండదు..మా రైతాంగ సాయుధ పోరాటం గురించి మీకెందుకు తెల్వదు...?

నీ బొంద. హైదరాబాద్ రాష్ట్రమే కాదు. ఇదివరకు కలిసి ఉన్న ఉమ్మడి మదరాసు రాష్ట్రం గురించి కూడా ఉండదు. అసలు నీవు పెద్ద బాల శిక్ష చదివావా? చదివి ఉంటే నీ తెలుగు ఇలా తగుల బడి ఉండేది కాదు.
.

16. మాకు కరెంటు వచ్చినంక 17 ఏండ్ల తర్వాత మీరు కరెంటు కళ్ల చూసిన మాట వాస్తవమా..? కాదా..?

మీ నిజాం నవాబు తనకు, తన ఉంపుడుగత్తెల్లాంటి భార్యల కోసం చేసుకొన్న/అమర్చుకొన్న సౌఖ్యాలు మీ కోసం అనుకొనే తప్పుడు ఆలోచన నుండి బయటకు రా.


20. సీమాంధ్ర పెట్టుబడి దారులు అప్పణంగా తెలంగాణ భూములను కొల్లగొడుతున్న మాట నిజం కాదా..?

ఓరి పిచ్చి సన్నాసీ, ఆ భూములు కొన్నది వేలం పాటల లోనూ మరియూ మార్కెట్ విలువకన్నా ఎన్నో రెట్లు ఆ రోజు ఉన్న ధర కన్నా ఎక్కువ ఇచ్చి కొనుకొని, వాటిని సాంకేతిక పరంగా అభివృద్ధి పరచి (మల్లె దానికి తెలంగాణా వారికే ఉద్యోగావకాశాలు) దానికి కొంత లాభం కలుపుకొని అమ్మితే దోపిడీనా? ఆ రోజు అమ్ముకొన్న భూములవలన వచ్చినదానిని తిని, తాగి తందనాలాడి తగలేసి ఎదుటివాళ్ళు మమ్మల్ని దోచుకోన్నారనడం మీకే చెల్లిందిరా నాయనా.

Thursday, 8 September 2011

పేరులో చివరన కుల సంకేతాన్ని మాత్రమె త్యాగించిన ఘనుడు - ఆచార్య ముద్దసాని కోదండ రామ రెడ్డి

ఎవరైనా కాశీకి వెళ్లి తమకిష్టమైన పండుని మరియూ కాయగూరని వదిలేస్తారు. కానీ మన కాకతీయ విశ్వవిద్యాలయ ఆచార్యులూ, విధులు ఎగ్గొట్టి, విద్యార్థులకు బస్సులు తగలేయడం ఎలా, ఎదుటివారిని తన్నడం ఎలా అనే వీరోచిత విద్యలలో తర్ఫీదునిచ్చే ఆచార్య కోదండ రామ రెడ్డి గారు కాశీ కి వెళ్ళకుండానే తమ పేరు చివరన రెడ్డి అనే పదాన్ని త్యాగం చేసారు. ఎవరైనా ధనాన్ని త్యాగం చేస్తారు లేదా ఏదైనా ఉద్యమానికి పొట్టి శ్రీ రాములు గారి లాగా ఆమరణ నిరాహార దీక్ష పేరుతొ ఆత్మ త్యాగం చేస్తారు లేదా మన తెలంగాణా వాదులు చెప్పుకొన్నట్లుగా 600 మంది ఆత్మ త్యాగాలు చేసారు అని చెప్పడం విన్నాను. కానీ, నేను నా ఉద్యోగాన్ని త్యాగం చేయను, కానీ నా పేరు చివరన ఉన్న రెడ్డి అనే పదాన్ని త్యాగం చేసాను అనే అతి మేధావి మరియూ అతి పిన్న వయసులో (50 +) డాక్టరేట్ అయిన ఆచార్య వర్యులు శ్రీ కోదండ రామ రెడ్డి గారు. ఆయనని నేను ప్రొ.కోదండ రామ రెడ్డి అని సంబోధించినందులకు నా తెలంగాణా మిత్రులు నామీద అలుక వహించి నీవు మా కోదండ రాం సర్ ని అవమానిస్తున్నావు అని తిట్టిపోశారు. ఈయనకి శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆదర్శం. శ్రీసుందరయ్యగారు తన కుల సంకేతాన్ని రెడ్డి అనే పదాన్ని త్యాగం చేసారు అంతే కాదు బిడ్డలు పుడితే దేశ సేవ చేయలేనని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకొన్న మహానుభావుడు అంతే కాదు తన కున్న వ్యవసాయ భూమిని కమ్యూనిస్ట్ పార్టీ కోసం, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం త్యాగం చేసిన మహా వ్యక్తి ఆయన. ఆయనని చూసి ఆ త్యాగ గుణాన్ని నేర్చుకోవలసినది పోయి నా పేరులో ఉన్న రెడ్డి అనే పదాన్ని త్యాగం చేసాననడం హాస్యాస్పదం. ఇక్కడ నాకొక సందేహం, స్వాములవారి వద్ద త్యాగం చేయడానికి ఏమీ లేక తన గోచీ గుడ్డని త్యాగం చేసినట్లుగా మన ఆచార్యులు ముద్దసాని కోదండ రామ రెడ్డి గారు రెడ్డి అనే పదాన్ని త్యాగించినట్లుగా ఉంది. అయ్యా కోదండ రామ రెడ్డి గారు, మీరు మీ పేరులోని రెడ్డి పదాన్ని త్యాగం చేయక పోయినా వచ్చే నష్టం ఏమీ లేదు. మీరు ఇతరుల ప్రాణ త్యాగాలకు పాల్పడే విధమైన ప్రకటనలు చేయకుండా ఉంటే అంతే మంచిది.