Saturday 24 September 2011

అసలు తెలంగాణా రాష్ట్రము ఎందుకివ్వాలి?

ప్రతీ వేర్పాటువాది, తెలంగాణా ఎందుకు కావాలో నేను వంద కారణాలు చెబ్తాను అని పెద్ద పోటుగాడిలా చెడ్డీ కట్టుకోవడం రాని వాడు కూడా మాట్లాడేవాడే. కానీ సరియైన కారణం వాళ్లు చెప్పరు, వాళ్లకే తెలియదు. ఇది ఎలా ఉందంటే, చిన్న పిల్ల వాడు చాక్లెట్ కొనివ్వకపోతే చేసే ఆగం కన్నా అధ్వాన్నంగా చేస్తున్నారు. ముందు నీళ్ళ, నిధుల, విద్య, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలలో మేము అందరికన్నా వెనకబడిపోయాం అని ఏడ్చి రాగాలు తీసారు. తరవాత, ఆ ఏడుపులు అన్నీ అబద్ధం అని ఋజువయ్యేసరికి మీరు మా భాషని, మా సంస్కృతిని అవమానించారు అన్నారు. అది కూడా ఎవరూ నమ్మక అబద్ధాలు చెబుతున్నారని తెలిసాక, తమ బండారం బయటపడి పోయిందని తెలిసి ఆత్మ గౌరవం, స్వయం పరిపాలన అనడం మొదలు పెట్టారు. స్వయం పరిపాలన అంటే మిమ్మల్ని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే సీమాంధ్రులు అంటారు. కానీ మంత్రి వర్గంలో ఉన్నవాళ్ళు ఒక్క సీమంద్రులే కాదు కదా. తెలంగాణా వారు సింహ భాగాన్ని అనుభవిస్తున్నారు కదా. అంటే ఈ తెలంగాణా మంత్రులు ఎవరూ తెలంగాణా తల్లి దండ్రులకు పుట్టలేదా అని నాలాంటి అమాయకుడు ప్రశ్నిస్తే, నువ్వు ఆంధ్రా వారి అహంకారం తో మాట్లాడుతున్నావు అని నా మీద దాడి చేస్తారు. అంతే కాకుండా మా భావాలని గాయపరిచావు లేదా మా ఆత్మాభిమానాన్ని అవమానించావు అని యుద్ధం ప్రకటిస్తారు.

అంటే, వీళ్లు అన్ని వాదనలలోనూ ఓడిపోయాక తెలంగాణా, మా అరవయ్యేళ్ళ కల లేదా ఆకాంక్ష, మా జన్మ హక్కు అని మొదలు పెడతారు. దానికి సమాధానంగా సీమాంధ్రుల కల తెలంగాణా 10 రాష్ట్రాలుగా విడిపోవాలని లేదా ఎవరో ఒక వ్యక్తిని మర్డర్ చేయాలనీ నా చిన్నప్పటి కల అంటే ఒప్పుకొంటారా? ఈ ప్రశ్న అడిగినందులకు నన్ను ఎన్ని బూతులు తిడతారో బెదిరింపులు ఇస్తారో ఆ భగవంతునికెరుక. వీళ్ళ అన్యాయమైన కోరిక కోసం ఎన్ని కుయుక్తులు పన్నాలో అన్నీ పన్నారు. ఒకటి కేంద్రంలో కనబడిన ప్రతీవాడికి మా తెలంగాణా మాకు ఇప్పించండి అని వాళ్లని బతిమిలాడారు. కానీ పార్లమెంట్ లో గత సమావేశాలలో బీ జే పీ వారితో కలిసి ప్రైవేట్ బిల్లు పెట్టినప్పుడు పీ సి సర్కార్ చేసే జాదూటోనా లాగా అసలైన తెలంగాణా గాంధి శ్రీ కచరా గారు మాత్రం పార్లమెంట్ లో మాయం . అసలు పార్లమెంట్ లో ఈయన మాట్లాడినది ఏమైనా ఉందా? సిని హీరోలు హీరోయిన్లను ఫోటో సెషన్ కి సినిమా రిలీజ్ కి ముందు వెళ్లినట్లుగా ఒకసారి పార్లమెంట్ కి వెళ్లి మీరా కుమార్ దగ్గర లోక్ సభ వెల్ లో నిల్చొని తన దశమ సోదరి అనబడే విజయశాంతి గారు అక్కడ తన అభినయ కౌశలముతో బంగారు నెమలి వచ్చేట్లుగా దుఃఖించి వచ్చారు. ఆ తరువాత మన దొర వారు మళ్లీ పార్లమెంట్ లో కనబడితే ఒట్టు.

అలాగే, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో తెలంగాణా కాంగ్రెస్ నాయకులు తమ తెలంగాణా వాదాన్ని వినిపించడానికి పార్లమెంట్ లో సిద్ధపడి, ప్రతిపక్ష పార్టీ బీజేపీ నేత తో తప్పుల తడక గా తమ వాదాన్ని వినిపింప చేసినందులకు ఆవిడకి సభా హక్కుల నోటీసు ఇచ్చారు అది వేరే విషయం. ఆ సమయం లో మా వెలమ దొరవారు తమ దొరతనం చూపిస్తూ ఇక్కడ హైదరాబాద్ లోనో లేదా కరీంనగర్లోనో విశ్రాంతిని ఆస్వాదించారే కానీ పార్లమెంట్ గుమ్మం తొక్కితే తూ నా బొడ్డూ గా వ్యవహరించి, ప్రస్తుతం తన ఇంటి పాలేరులా వ్యవహరించే ఆచార్యవర్యులు తో కలిసి సకల జనుల సమ్మె పేరుతొ ప్రజలని ఇబ్బందులలోకి నెట్టివేసి ఆనందం అనుభవిస్తూ, వచ్చే ఉప ఎన్నికలలో పోచారం చేత నామినేషన్ వేయించడమే పనిగా పెట్టుకొన్నారు. అంతే కాకుండా మిగిలిన పార్టీల వారెవరూ నామినేషన్ వేయకుండా తమదైన శైలిలో గూండాయిజం చేస్తున్నారు. చెప్పేవి శ్రీ రంగనీతులు అన్న చందంగా ప్రవర్తిస్తూ తమ మాటకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని తెలంగాణా ద్రోహులు అని ఏదో అచ్చోసిన ఆంబోతులా మీద వేసినట్లు గా ముద్ర వేస్తూ ప్రజలని కాల్చుకు తినే వారిని ఎందుకు నమ్మాలి? ఏమని నమ్మాలి?

నిన్ననే మన ఆచార్య పుంగవులు మిలిటెంట్ తరహాలో శాంతియుతంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటన ఇచ్చారు. మిలిటెంట్ ఉద్యమం అంటే మన అల్లం నారాయణ గారు నమస్తే తెలంగాణా దిన పత్రికలో తమ ఎడిటోరియల్ లో రాసినట్లుగా సీమాంధ్రలోని ముడ్డి కడుక్కోవడం రాని బుడ్డోడు కూడా అర్థం చెబుతాడు. ఇంతకీ మిలిటెంట్ తరహా ఉద్యమం శాంతియుతంగా ఎలా చేస్తారో మన ఆచార్య పుంగవులు ముద్దసాని కోదండ రామ రెడ్డి గారు, శ్రీ కచరా గారు వారి పార్టీ సభ్యులు, వారితో ఖమ్మంలో వేదిక పంచుకొన్న మాననీయ భారతీయ జనతా పార్టీ వారితో పాటు, వారికి జన సమీకరణకు తమ వంతు ఉడతా భక్తి గా ఇతోధికంగా ప్రజలని సభకి తోలుకొని వచ్చిన అత్యంత దేశ భక్తులు అప్పుడప్పుడు మాత్రమె తమకు లొంగని వారిని, తమకు ఎదురు చెప్పినవారిని ప్రజా కోర్టులు నిర్వహించి వారి తలల్ని న్యాయంగా నరికివేసే పుణ్య మూర్తులు అయిన నక్సలైట్ నాయకులు బాగా విడమరచి చెప్పగలరు. వీరంతా కలిసి తెలంగాణా ఉద్యమం పేరుతొ ప్రజల జీవితాల్ని అస్తవ్యస్తం చేసేసారు. వీరికి తోడు సత్రకాయలాంటి తెలంగాణా కాంగ్రెస్ నాయకులు, తెలంగాణా తెలుగు దేశం నాయకులు ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు వాగుతూ ప్రజలని రెచ్చగొడుతూ సాధారణ పౌర జేవనాన్ని దుర్భరం చేస్తే కేంద్రం తెలంగాణా ఇవ్వదని తెలిసీ ఉద్యమాలు చేస్తున్నారంటే ఎంత రాక్షసంగా ఉన్నారో అర్థమవుతోంది. పైగా వీళ్లకి వంత పాడక పొతే మెతుకు దిగనివ్వరని మిగిలిన కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఎంతో పవిత్రంగా భావించే వైద్య సంఘాలు ఇంక ఈ సంఘం ఆ సంఘం అని చెప్పాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల సంఘాల లోనూ ఈ ఉద్యమకారుల కోవర్టులు ఆయా సంఘాల నాయకుల చేత తమదైన శైలిలో తెలంగాణాయే మా ఆశ అని ప్రకటనలు ఇప్పించి వారి నాయకుల చేత సమ్మెలో పాల్గొనడం ఇష్టం లేని వారిని కూడా పాల్గోనేట్టు చేసి చేయక పొతే తమ బాహు బలం తో వారికి బద్ది చెప్పగాలవారే ఈ ఉద్యమానికి సారధులు.

ఇన్ని అకృత్యాలు చేసే వారికి రాష్ట్రం ఇస్తే ఎలా ఉంటుందో ఇప్పుడే సాంపిల్ గా రుచి చూపిస్తున్నారు. ఇంత చేసినవారికి తెలంగాణా ఇస్తే మామూలు ప్రజల గతి అధోగతే.

1 comment:

  1. కోదండ రాం నోటి వెంట గాంధీ తరహా ఉద్యమం అన్న మాటా? నవ్వి పోతారు. మహాత్మా... మా తెలుగు జాతిని మన్నించు. దయ్యాలు వేదాలు వల్లించటం అన్నది ప్రత్యక్షంగా చూస్తున్నాం.
    http://andhraaakasaramanna.blogspot.com/2011/09/blog-post_24.html

    ReplyDelete