Friday, 20 January 2012

అంబేద్కర్ - దేశ భక్తుడా? దేశ ద్రోహా?

భీమ్ రామ్ జీ ఆంబేద్కర్ ని దేశ భక్తుడు అనదగ్గ కారణాలు ఏవీ నాకైతే కనబడలేదు. కానీ ఉత్తర్ ప్రదేశ్ లోని నేతామణి కుమారి మాయావతి ఆవిడ నిత్యమూ పూజించే కాన్షీ రామ్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోని సంకర రావు లేదా మంద కృష్ణ మాదిగ లేదా కత్తి పద్మారావు మరియూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఆంబేద్కర్ కి ఇవ్వ వలసిన గౌరవం కన్నా ఎక్కువ ఇచ్చి మిగిలినవారిని వెధవలు అని నిరూపించ ప్రయత్నం చాలా సార్లు చేశారు. ఇప్పుడూ చ్సెస్తున్నారు.

నా దృష్టి లో ఆంబేద్కర్ ఒక దేశ ద్రోహి. బరోడా మహారాజు కి అమ్ముడుపోయి ఆ రాజు కాళ్ళు ఒత్తిన వ్యక్తి. మాహాత్మా గాంధీ ఈ దళిత నేతని తమ సమాజం వారిని మిగిలిన దళితులని స్వాతంత్ర్య పోరాటం లో పాలుపంచుకొనేవిధంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడానికి రమ్మనమని నిమంత్రణ ఇస్తే దానిని తిరస్కరించి, బ్రిటిష్ వాళ్ళకి తొత్తుగా వ్యవహరించిన మగానుభావుడు. ఈయన 1936లో స్వంతంగా ఇండెపెండెంట్  లేబర్ పార్టీ పెట్టి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కి ఒక 15 స్థానాలు గెలుచు కొన్నాడు. తాను పుట్టిన మతంలో తనకు అవమానం జరిగిపోతోందంటూ వెళ్లి బౌద్ధ మతం లో చేరిపోయాడు. స్వంత మతం మీద నమ్మకం లేక ఇతరమతాలలో దూరేవాళ్ళకు ఉండే దుర్గుణాలు అన్నీ ఈ పుణ్యపురుషుడు మూటకట్టుకొన్నాడు.  ఎలాగంటే హిందీ లో సామెత ఉంది 'నయా ముల్లా ప్యాజ్ తేజ్ ఖాతా హై' అని ఆ విధంగా ఒక మతం మీద కక్ష కట్టిన దయామయుడు మన అంబేద్కరుడు.

భారత దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న చాలా మండి దేశ ద్రోహులు స్వతంత్రం వచ్చాక అనేక రకాల పదవులు పొందిన వారు ఉన్నారు. వారిలో మన అంబేద్కరుడు అగ్ర తాంబూలానికి అర్హుడు. కారణం ఈయనని స్వతంత్ర ఉద్యమం లో పాలుపంచుకొమ్మంటే కాదు పొమ్మన్న పెద్దమనిషి భారత రాజ్యాంగ కమిటీ కి అధ్యక్షుడిగా చేయ బడి ఎంతోమంది కష్టపడి తయారుచేస్తే మొదటి పుట పైన తన సంతకాన్ని గిలికి అది తనదే అన్న బిల్డప్ ఇచ్చిన అరివీరభయంకరుడు. అంటే ఎదుటివారి శ్రమని దోచుకొన్న మహా మనిషి.  

ఈయన లోక్ సభ కి గెలవలేని నాయ్కుడు. ఆ తరువాత మన విజయ్ మాల్య లేదా రాహుల్ బజాజ్ లేదా హేమామాలిని లాగా దొడ్డి దారిన అనగా రాజ్య సభకి నామినేట్ చేయబడిన మహా నాయకుడు. ఈయనని ప్రధాన మంత్రి నెహ్రూ తన లా మినిస్టర్ గా నియమిస్తే, తనకి మంచి పోర్ట్ ఫోలియో ఇవ్వమని నిస్సుగ్గుగా అడగగలిగిన పురాణ పురుషుడు.

దేశానికి రిజర్వేషన్లు అనే శాపాన్ని ఇచ్చి, కులాల కుమ్ములాట అనేదానికి ప్రాణం పోసిన అపర బ్రహ్మ. ఇటువంటి వ్యక్తిని భుజాన మోసుకొని తిరిగే వాళ్ళు మన మాయావతి, కన్షీరామ్, కాంగ్రెస్ నాయకులు మరియూ తదితర పార్టీల నాయకులు. ఇటువంటి వాడికి భారత రత్న చచ్చిన 30 ఏళ్లకి ప్రసాదించిన కాంగ్రెస్ పార్టీ కూడా దేశ ద్రోహులని ప్రోత్సహించే పార్టీగా భావించాలి.  

29 comments:

  1. మీ విషయ పరిగ్యానం మీ రాజకీయ అవగాహనకు సమానంగానే ఉంది, శభాష్! డాక్టర్ అంబేద్కర్ గారికి భారత రత్న సమ్మానం ఇచ్చి ఆ పురస్కారానికే వన్నె తెచ్చింది జనతా దళ్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టి కాదు.

    నచ్చని వాళ్ళందరిని దేశాద్రోహులగా ముద్ర వేసే మీ సంస్కారానికి చేతులెత్తి జోడించాలి. మిమ్మల్ని కన్న "తెలుగు తల్లి" ధన్యురాలు.

    ReplyDelete
    Replies
    1. Gottimukkala garu meeru chala baga chepprandi. I agree with you.

      Delete
  2. ఏ రాయి అయితేనేమీ పల్లూడగొట్టుకోవడానికి అడ్డమైన పార్టీ దళితుల వోట్లకోసం కుక్క బిస్కత్తులలా ఏదో ఒక ఎవార్డో మరేదో పారేసి వాళ్ళ వొట్లని కొల్లగొట్టుకోవడమే పని. ఇంకా జనాదల్ పార్టీ స్వర్గీయ విశ్వనాథ ప్రతాప్ సింగు గారికి ఈ అంబేద్కరీయులు దేవుళ్ళు. ఆ విశ్వనాథ ప్రతాప్ సింగు గారి భార్య ఆయన మీద ఆయనకి పిచ్చి పట్టిందని కోర్టుకెక్కింది. ఇంకా ఈ దళిత బాంధవుడు అని పొగడబడుతున్న వ్యక్తి ఒక దేశ ద్రోహి అంటే బాధ ఎందుకో. స్వాత్నత్ర్య సమరంలో ఈ దళిత బాంధవుడు బరోడా రాజు బూట్లు నాకిన విషయం మరిచిపోయారు. ఈయన పూనాలోని కాలేజ్లో ప్రింకిపాల్ గా బ్రిటిష్ వారి రాజ్యంలో ఉద్యోగం వెలగబెత్త్డు. అప్పటికే మిగిలిన నాయకులు అంటే లాల్ బహదూర్ శాస్త్రీజీ వంటి వారు ఎన్నో త్యాగాలు చేస్తే ఈయన మాత్రం పుస్తకాలు రాసుకొంటూ శుభ్రంగా జీతాన్ని అనుభవించిన మహా దేశ భక్తుడు. తనకి లా మినిస్టర్ పదవి వద్దు, మంచి పోర్ట్ ఫోలియో ఇవ్వమని నెహ్రూ ని దేబిరించిన భారత రత్న. చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంటే ఇంకా వాదన ఒకటి.

    ReplyDelete
  3. కొన్ని విషయాలు అంతా సులభంగా అర్థం కావు .ఈ దేశం లో రిజర్వేషన్ లు , భు సంస్కరణలు లేక పోయి ఉంటే మనదేశం , పాకిస్తాన్ , ఆఫ్ఘన్ కన్నా అధ్వానంగా ఉండేది ( నాది రిజర్వేషన్ లేని కులమే )

    ReplyDelete
  4. రిజర్వేషన్లని అసలు ఇవ్వవద్దని చెప్పడం నా ఉద్దేశం కాదు. రిజర్వేషన్లు అర్హులైన వారికి ఇవ్వాల్సిందే. కానీ ప్రస్తుత పరిస్థితులని చూస్తే అవసరమైన దాని కన్నా ఎక్కువ అయిపోయి టాలెంట్ ని చంపేస్తున్నాయి. ఒకే ఇంట్లో తండ్రి, తల్లి, అక్క, బావ, అన్న, వాడిన అందరూ రిజర్వేషన్ల మీద సీట్లు, ఉద్యోగాలు సంపాదించి,తనకు పుట్టబోయే పిల్లలకు కూడా రిజర్వేషన్ కావాలనే వాళ్ళు తయారయ్యారు. మన దేశంలో ఈ రోజున ఏవో రెనో మూడో కులాలు తప్పించి మిగిలిన ఏ కులమూ రిజర్వేషన్ల నుండి వేరుగా లేవు. అయితే ఎస్ సీ, ఎస్ టీ, బీసీ(ఇందులో ఏ నుండి జడ్ వరకూ పెట్టేశారు). ఆ మిగిలిన కులాలని కోడా ఏదో ఒక కోటాలో పారేస్తే మంచిది కదా? కానీ చేయరు. ఎందుకంటే మన దరిద్రగొట్టు నాయకులకి వోట్ బాంకులు కావాలి. నేను ఆ విషయం మీద విమర్శించానే తప్ప వేరే దురుద్దేశం తో కాదు.

    ReplyDelete
  5. The point is not about reservations but the quality of discourse. నోరు బ్లాగు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం మీకుంది, కాదనను. అయితే దేశ ద్రోహం అంటే ఏమిటో మీరు నిర్వచనం తెలిపితే విని తరించే అవకాశం మాకు ఇవ్వండి.

    మీరు ఏ నిర్వచనం ఇచ్చినా (ఉద: బరోడా రాజుకు "అమ్ముడు", హిందూ మతం వదిలేసి బౌద్ధ మతం స్వీకరణ), వాటిని అందరికీ వర్తింప చేయాలి కదా. For instance, Gaekwad should also be treated as a traitor.

    ReplyDelete
  6. Daya chesi ee murkuditho vadhinchakandi.

    ReplyDelete
  7. it shows your unwise and unethical attitude. it seem you are a journalist. dont you know to write a single sentence in telugu, you have every right to criticise Ambedkar. the language you are using is telling your standard
    you should remove this post immidiately, otherwise a legal action wil be initiated against you. if you are a human being you shoud come with your full address

    ReplyDelete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
  9. అయ్యా..
    మీరు అంబేద్కర్ మీద బాగా కసిగా ఉన్నట్లున్నారు.
    ఇట్లాంటి దుమ్మెత్తిపోసే కార్యక్రమం మంచిది కాదేమో!
    నా బ్లాగు.. నా ఇష్టం! అంటారా?
    ఇటు వైపు ఇక రాన్లేండి!

    ReplyDelete
  10. Karthik Narayan, you may read the biography in Wikipedia and the information is extracted from there. Now, you are threatening me about the comment on Ambedkar. It is nice. Why do you peole fail to condemn the criticism on Mahatma Gandhi and other leaders. Do you dare to sue against those who commented on Gandhi vulgarly? Moreover, I have my own opinions and need not change them. I did not post this blog to read and comment. It is my opinion I have expressed in this blog.

    ReplyDelete
  11. వై ఏ రామనగారు, నాకు అంబేడ్కర్ మీద కాశీ, కోపం ఏమీ లేవు. ఆయనని అవసరమైనడానికన్న ఎక్కువ పొగిడి, రాజకీయనాయకులు ఆయన పేరుని ఉపయోగించుకొని దళితులని అనేక మార్లు మోసం చేస్తూ ఉంటే అమాయకులైన ప్రజలౌ వారి మాయ మతాలలో పది తమ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకొంటున్నారనే బాధతో రాసినది.

    ReplyDelete
  12. జై గొట్టుముక్కల గారు, నేను రాసిన బ్లాగు పూర్తిగా చదవలేదనుకొంటాను. నేను రాసినది భారత దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న చాలా మండి దేశ ద్రోహులు స్వతంత్రం వచ్చాక అనేక రకాల పదవులు పొందిన వారు ఉన్నారు. ఇది మీరు చెప్పిన గైక్వాడ్ లేదా గ్వాలియర్ మహారాజా సింధియాలకు, మిగిలిన రాచ కుటుంబాలకు వర్తిస్తుంది. ఆ రాచ కుటుంబాలు చాలా వరకూ నేడు కేంద్రం లోనూ, వివిధ రాష్ట్రాలలోనూ అనేక మంత్రి లేదా అధికార పదవులు అనుభవిస్తున్నారు.

    ReplyDelete
    Replies
    1. I did read your blog. My point is that you have branded Dr. Ambedkar a traitor by arbitrarily picking points against him.

      Every "leader" is treated larger than life by his followers. Why pick only one of these?

      Delete
  13. మన రాజ్యాంగ నిర్మాతనే దేశ ద్రోహి అని తిట్టిన ఈ బుద్ధిలేని వెధవని ఈ దేశంలో ఉంచటం చాల ప్రమాదం మరియు మన బాధ్యతా రాహిత్యం కూడా ....అగ్రకుల ధన, అదికార మదం ఏమైనా చేపిస్తుంది ...బహుజన సోదరులారా !! ఆలస్యం చెయ్యకుండా వీన్ని మన దేశ సరిహద్దులు దాటే వరకు తన్ని తరిమి కొడదాం రాండ్రి.

    ReplyDelete
  14. అయ్యా, కొటేశ్ గారు, నేను ఆయన కులం మీద ఒక్క పరుష శబ్దాన్ని ప్రయోగించలేదు. కానీ మీ యొక్క కుల పిచ్చి ఎంతవర్కూ వెళ్లిందంటే ఎదుటివారి యొక్క సహేతుక విమర్శని కూడా అంగీకరించలేని క్షుద్ర వాదన లాగే ఉన్నది. మీ యొక్క కుల వివక్షత ఇంత ఘోరం గా ఉంటుందని తెలిసి చాలా బాధ పడుతున్నాను. తెలంగాణా లో కుల పిచ్చి లేదు అని కూసే వాళ్ళు ఎటువంటి వారో మీ విమర్శ ని చూశాక ఇంకా బాగా అర్థమయ్యింది ఇక్క కుల పిచ్చి ఏ స్థాయిలో పాతుకుపోయిందో. దీనిని మీ మనసుల లోంచి తీయాలి అంటే అంబేడ్కర్ మరో జన్మ ఎత్తినా బాగుపడరు. ఆయన ఆత్మ ఘోషించే విధంగా ఉన్నది మీ విమర్శ.

    ReplyDelete
  15. This comment has been removed by the author.

    ReplyDelete
  16. అంబేడ్కర్ గురించి ఒక్క పల్లెత్తు మాట కూడా పబ్లిక్‌గా మాట్లాడ్డానికి వీల్లేకుండా పోతూంది. ఇలాంటి వాదనలు చాలా అవసరం. ఈ బ్లాగరుతో విబేధించాలంటే చేయండి. తిట్లు వద్దు.

    ReplyDelete
    Replies
    1. అంబేద్కర్ గురించయినా, ఇతరుల గురించయినా ఎన్ని మాటలన్నా నాకు అభ్యంతరం లేదు. విమర్శలు సహజమా అయినా దేశద్రోహం ముద్ర వేసే ముందు దానికి కారణాలు హేతుకంగా ఉండాలన్నదే నా వాదన.

      Delete
  17. జై గొట్టుముక్కల గారు, నేను ఒక పార్శ్వం నుండే చూసి అతని తప్పులని మాత్రమే రాశాను దానితోనే నేను అంబేడ్కర్ దేశ భకుతుడు కాదు అన్నానని మీ అభిప్రాయం చెప్పారు. నేను చెప్పేది, అంబేడ్కర్ భారత రత్నకి తగనివాడు అనే ఉద్దేశం తోనే ఈ బ్లాగుని రాశాను. మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. శ్రీమతి ఇందిరా గాంధీ కి భారత రత్న ఇచ్చినప్పుడు కూడా చాలా రకాలైన విమర్శలు వచ్చాయి. అలాగే ఇదీను. ఇందిరాగాంధి కి భారత రత్న ఇచ్చే సమయానికి నేను చాలా చిన్నవాడిని. ఇంకా అంబేడ్కర్ కి భారత రత్న చనిపోయిన 30 సంవత్సరాల కి ఇచ్చారు. ఎందుకు? అలాగయితే అతని కనా దేశ భక్తుడు నెహ్రూ కి ఇవ్వాలి. కారణం తన వద్ద నున్న ఆస్తి నంతటినీ త్యాగం చేసిన మహనీయుడు. టంగుటూరి కి ఇవ్వాలి. సంపాదించినడంతా స్వతంత్ర పోరాటంలో ధారపోసిన త్యాగమూర్తి. పోనీ వారిరువురూ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏమైనా సంపాదించారా? అంటే శూన్యం. ప్రకాశం పంతులుగారైతే ముఖ్యమంత్రి గా పదవీచ్యుతుడైన తరువాత తిండి కూడా లేక పస్తులు ఉండేవాడు. నెహ్రూ సంపాదించినది ఏమీ లేదు. ఆయన వారసులు ఏమైనా సంపాదించారు అంటే అది అక్రమార్జన తోనే. ఇంకా లాల్ బహదూర్ శాస్త్రి గారి కన్నా గొప్పవాడా అంబేడ్కర్? లాల్ బఃదూర్ శాస్త్రి గారు కూడా వెనుకబడిన కులం వారే. అంబేడ్కర్ చనిపోయిన తరువాత చాలా కాలానికి శాస్త్రీ జీ పరమపదించారు. ఆయన అంతటి దేశ భక్తుడిని మనం ఇంక ఈ కాలంలో చూస్తామనే నమ్మకం లేదు. ఆయనకి ఎందుకివ్వరు? ఆయన సంతానం ఏమీ గొప్ప పదవులలో లేరు. అంతదాకా ఎందుకు. మహాత్మా గాంధీ కి ఎందుకివ్వరు? ఆయన కొడుకులు మనుమలు ఎవ్వరూ రాజకీయాలలోకి రాలేదు. అంబేడ్కర్ కి భారత రత్న ఇచ్చినది అతని కులం ఆధారంగానే. ఇది కాదనలేని సత్యం. దేశంలోని బడుగువర్గాలవొట్లని దోచుకొందామనే దురుద్దేశం తోనే నాటి ప్రధాన మంత్రి రాజా జయచంద్రుడి లాంటి కుళ్లుబోతు విశ్వనాథ ప్రతాప్ సింగ్ (క్షత్రియుడు) ఈ అవార్డ్ ని ఇచ్చారు. ఇది ప్రజల్ని రెండుగా చీల్చడానికి ఉపయోగపడిండే కానీ అంబేడ్కర్ ఏదో మాహా గొప్పవాడు అని నిరూపించబడలేదు.

    ReplyDelete
    Replies
    1. Your "facts" are not matching up. Nehru was awarded Bharat Ratna in 1955 while Shastri (not a BC as you claim) received the award in 1966.

      Most pre-independance stalwarts received the award in their life time during the Gandhi family rule. The major exceptions were Dr. Ambedkar, Sardar Patel & JP. These anomalies were corrected by later non-Congress Govt.s. Gandhi died before the award was initiated (and in any case was considered to be much above all these).

      భారత రత్నకు తగని వాళ్ళందరూ దేశద్రోహులా? అంబేద్కర్ గారిని సమ్మానించిన పాపానికి వీపీ సింగ్ కు జయచంద్రుడనే ముద్ర వేయాలా?

      Delete
    2. half knowledge ralla bhandi..

      Delete
  18. Dear Jai Gottumukkala, Lal Bahadur Shastri belongs to the caste "Tyagi" which is backward caste in UP and the code number is 68 of UP Backwardclass list.MOreover, Bharata Ratna was awarded posthamously in 1966.
    Now, I did not say the people who do not deserve for Bharata Ratna are traitors but Ambedkar will be remained as a traitor as he refused to take part in Indipendence struggle favouring the British and supported the then Zamindars and Maharajas. Here, the Mharajas and Zamindars are also traitors as they worked for British and helped them to suppress the movement. You may respect Viswanath Pratap Singh as he divided the society into sections with caste and creed. He imposed the Mandal recommendations on the head of Indians for his selfish motives but failed to succeed to sit in the PM chair.

    ReplyDelete
    Replies
    1. As far as I know, Lal Bahadur was a brahmin. The award was posthumous only because he died suddenly mid-term. In any case, the point becomes redundant due to your definition of treason.

      VP Singh (or anyone else for that matter) did not divide people into castes. The division was already there from ages.

      Delete
  19. @Ravindranath: A different question on an unrelated matter. Your profile lists విశాలాంధ్ర మహాసభ in "My blogs". Chaitanya says you are not a member of the organization much less the owner of the blog.

    Why don't remove the blog from your "My blogs"?

    ReplyDelete
  20. Jai Gottumukkala, this blog does not have any connection with Visalandhramahasabha blogs. This blog name is my own. I just contribute blogs to Visalandhramahasabha which may be edited by them before publishing. I post My personal blogs on my name itself. Hope, it is cleared to you.

    Your doubt about the caste of Shastri Ji is not correct. Shastri is an examination equallent to doctorate in Benaras Hindu University. It is just a degree only. You may know the former Agriculture Minister of BJP Mr.Sompal. His father had the degree of Shastri though he belongs to the caste Jat. You may have good opinion on the former Prime Minister late VP Singh but I need not have the same opinion.

    Removal of blog means that I have obliged the pressures from unwarranted quarters. I have just expressed my opinion. It is welcome to comment or criticise on my opinion. You can also express your opinion on any issue. My opinion may not be necessarily acceptable to all.

    ReplyDelete
  21. భారత రత్న బిరుదుకి ఒకప్పుడు ఉన్న విలువ ఇప్పుడు లేదు. దానికి కారణాలు అనేకం .దాదాపు

    ప్రతి ప్రధానమంత్రి కూడా కొన్ని వత్తిడులకి , లాబీ లకీ లోనై దీనిపై నిర్ణయం తీసుకున్నవాడే.

    మొదట్లో ఏ కొద్దిమందికో తప్ప, మిగిలినవారికి ఈ బిరుదు అడ్డదారిన వచ్చినదే...మొన్నటికి మొన్న

    దేవే గౌడ , డాక్టర్ రాజ కుమార్ కి ఈ బిరుదు ఇప్పించాలని ప్రయత్నించాడు. కసబ్ , అఫ్జల్

    గురు లాంటి వారి కే రాచమర్యాదలు , జరుగుతున్న దేశమిది. అంతెందుకు , ఒబామాకి నోబెల్

    శాంతి పైజు ఇచ్చాక దాని విలువ తగ్గిందని లోగొంతుకులతో అంటున్నారు. కాబట్టి ఇలాంటి వాటిని

    కేవలం రాజకీయ ఎత్తుగడలు గా మాత్రమే భావించి అనవసర ప్రాముఖ్యత ఇవ్వకుంటే

    మంచిది..భారత రత్న వచ్చిన వారు ఉన్నతులూ కాదు , రానివారు అధములూ కారు..నేతల

    అనుచరులు ముఖ్యంగా వీటికి అతిగా స్పందించకుంటే మంచిది, (బిరుదు వచ్చినా రాకపోయినా )

    ReplyDelete
  22. blogs lo kamma , bramhana kulapicchi yekkuvaga undi. bramhana kontha nayam kulapicchi vallato patu sahetuganga alochinche vallu unnaru. kammalo matram paritalaku bharata ratna ivvalani korukune vidhanga unnaru

    ReplyDelete
  23. 1. వివేక్ గారు, మీరు చెప్పినది నిజమే. స్పందించడం మానవ సహజం. ప్రతి వారికీ కోపం, క్రోధం, అసూయ అన్నీ ఉంటాయి. మహా మహులే వీటికి అతీతులు కారు. మానవమాత్రుడి ని నేనెంత? మీ యొక్క విమర్శ సహేతుకంగా ఉంది. తప్పక దృష్టిలో పెట్టుకొంటాను.

    2. ఈలం గారు, కులాభిమానం ఉండడం తప్పు కాదు. ముఖ్యంగా భారత దేశంలో కులాల గోదాల్ని పగులగొట్టేద్దామ్ విరిచేద్దాం అనే పదాలు టీవీ ప్రకటనలలోనే కనిపిస్తున్నాయి. మనం దేనికి అప్లికేషన్ పెట్టుకొన్నా ముందు ఈ కులం గొడవ మొదలవుతుంది. రిజర్వేషన్లు అని లేదా వేరే ఎదోనని, రాజకీయ సమీకరణాలు చెప్పడానికి అన్నిటికీ ఈ కులం గోల ఉంటోంది. మన దరిద్రగొట్టు నాయకులు కుల మతాలు పోవాలని వేదికలెక్కి కూస్తారే తప్ప ఈ కులాల గోడలు ఇంకా పెంచి పెద్ద చేస్తున్నది వాళ్ళే. నా చిన్నతనం లో అంటే నేను కాలేజీలో చదివే రోజులలో ఇంత కుల పిచ్చి మాకు తెలియదు. ఏదో పూజా సమయాల లోనూ, వివాహ సమయంలోనూ ఇంకా కొన్ని కర్మకాండలు చేసే సమయం లోనూ కులాచారాలని బట్టి చేసేవాళ్ళు. చాలా మండి తమ కుల వృత్తి చేసేవారు. ఉదాహరణకి చాకలి, మంగలి, కోమటి అలాగే మిగిలిన కులాల వారు తమ కుల వృత్తిని చేయడం గౌరవంగా భావించేవారు. వారిని కులం పేరుతో పిలిచినా తప్పు పట్టుకొనేవారు కాదు. ఉదాహరణకి బట్టలు ఉతకడానికి ఇంటికి వచ్చి తీసుకెళ్ళేవారు. ఒకవేళ రాకపోతే ఇళ్ళల్లో చాకలి వచ్చాడా లేదా వచ్చిందా అనేవారు. దానిని గ్రామాలలో ఎవరూ (రాజకులు కూడా)తప్పు పట్టేవారు కాదు. కానీ నేడు ప్రతీవారికి వారి కులం పేరుతో పిలిచినా పేరు ఎత్తినా దానిని మమ్మల్ని అవమానించారంటూ అసెంబ్లీ ఎదురుగా ధర్నాతో మొదలై ఎందుకు అన్నానురా భగవంతుడా అని తెలియక అన్నవాడు ఏడ్చే రోజులివి. కానీ ఈ కులాలు పోవాలనేవారిలో సాగమ్మండి కులం పేరు చెప్పి రిజర్వేషన్లు దొబ్బేవారే. అటువంటప్పుడు, నీ కులం పేరు చెబితే తప్పేమీతి అనేది నా వాదన.

    ReplyDelete