ఈ రోజులలో ఇడ్లీ తయారు చేయడం అంటే చాలా సులభంగా అయిపోతోంది కానీ మా చిన్నతనం లో ఇడ్లీలు తయారు చేయడం ఒక పెద్ద పనిగా ఉండేది. మా అమ్మ ఇడ్లీలని ఇడ్డెన్లు అని పలికేది. ఆవిడ బతికి ఉంటె ఇప్పుడు ఆవిడకి 74 సంవత్సరాలు ఉండేవి. ఆ ఇడ్డెన్లు తయారు చేయడానికి మినప పప్పుని ముందురోజు సాయంత్రం రెండు మూడు గంటల పాటు నానపోసి, దానితో పాటుగా ఉప్పుడు రవ్వ కూడా నాన పోసేవారు. కొంతమంది శిష్టుల ఇళ్ళలో ఆ ఉప్పుడు రవ్వని ఉపయోగించేవారు కాదు. వాళ్ళు బియ్యాన్ని నూక పట్టించి ఇంట్లో ఉంచుకొనే వారు. కానీ ఈ ఉప్పుడు రవ్వకి ఉన్న ప్రాశస్త్యం బియ్యపు రవ్వకి ఉండేది కాదు. ఆ నాన పెట్టిన మినప పప్పుని రుబ్బి దానిలో ముందుగా నానబోసిన ఉప్పుడు రవ్వో లేదా బియ్యపు రవ్వో ఉప్పు వేసి కలిపి గిన్నె పై మూత పెట్టేవారు. మరునాడు పొద్దున్నే లేచి ఆ పిండి ఎలా ఉందొ పరీక్షించేవారు. అప్పటికి ఆ పిండి బుస బుసా పొంగి చూడడానికి కాచిన పాల మీది పొంగులాగా కనిపించేది. ఆ ఊరుపిండిని ఇడ్డెన్లు (మా అమ్మ పరిభాషలో) పాత్ర ఇత్తడిది ఉండేది దానికి రెండే ప్లేట్లు ఉండేవి ఒక్కొక్క ప్లేట్ లోనూ మూడూ లేదా నాలుగు ఇడ్లీలు తయారయ్యేవి. ఆ ప్లేట్ల మీద గుడ్డ వేసి ఈ తయారైన ఊరు పిండిని వేసి పాత్రలో నీళ్ళు పోసి ఈ ఊరు పిండి వేసిన ప్లేట్లని ఆ పాత్రలో ఉంచి మూత పెట్టి పొయ్యి మీద పెట్టేవారు. ఆ రోజులలో గేస్ స్టవ్ లు లేవు. అందుచేత కట్టెల పొయ్యి ఇంట్లో తాయారు చేసేవారు. ఆ తరువాత ఉదికాయో లేదో చూసుకొని దించిన తరువాత ఆ ఇడ్డెన్లు ని పెట్టడానికి చట్నీ తయారు చేయడం, దానితో పాటుగా సాంబారు తయారు చేయడం ఒక ప్రహసనం గా జరిగేది. ఈ రోజు అంట కష్టపడక్కరలేకుండా మిక్సీలు, గ్రైన్డర్లూ ఉన్నాయి. అంతేకాకుండా ఇడ్లీ పాత్రలు నాలుగు అయిదు ప్లేట్లు ఒక్కసారిగా పట్టే పాత్రలు కూడా ఉండడం వలన ఇడ్లీ తయారీ అంత కష్టమైన పని కాదు. ఇప్పుడు ఇంకా అడ్వాన్సు అయి ఇన్స్టెంట్ ఇడ్లీ పిండి కూడా వచ్చేసింది. అందుచేత ఇడ్లీ తయారీ ఇంకా సులభతరం అయిపొయింది.
ఆ విధంగానే, మా అమ్మ గారు, నాయనమ్మ, అమ్మమ్మ గారలు సినిమాలని సెనిమాలు అనేవారు. ఇప్పుడు నా కూతురు 14 సంవత్సరాల పిల్ల కి చెబితే ఒకటే నవ్వు. మా అమ్మకి ఆ సెనిమాలు చూడడం చాలా ఇష్టంగానే ఉండేది. ఆవిడ నెలకు ఒకటి రెండు సెనిమాలు తప్పక చూసేది. మేము పెద్దవాళ్ళం అయి ఉద్యోగాలు వచ్చి వేరే చోట్ల స్థిరపడ్డాక ఆవిడ ఆ విధంగా సెనిమాలు చూడడం మానేసింది. మా మేనత్తకి కూడా ఈ సేనీమాల పిచ్చి బాగానే ఉండేది. ఇంకా మేము పిల్లలం అంతా మా మేనత్తగారి పిల్లలూ, నేను మా చిన్నన్నయ్య మా చెల్లెలు అందరమూ దసరా, సంక్రాంతి, వేసంగి సెలవులకి తాతయ్యగారి ఇంటికి వెడితే మాకు ఇంక ఈ సినిమాల పండగే. మా పెద్దన్నయ్య మాతో వచ్చేవాడు కాదు కారణం నా కన్నా దగ్గర దగ్గర అయిదు సంవత్సరాలు పెద్ద. అందుకని మాతో సినిమాలకి ఆంటే మాట్నీలకి వచ్చేవాడు కాదు. తాను తన స్నేహితులతో చూసేవాడు. కొత్త సినిమా వస్తే తాతయ్యగారి దగ్గరకి మా మేనత్తగారి పెద్దవాడిని (మా చెల్లెలి వయసువాడు) పంపి సినిమాకి ఆరోజు మాట్నీకి కావలసిన డబ్బులు ఇచ్చేవరకూ ఆయనని కోసి కొప్పరాళ్ళకు వేసేసి ఆఖరికి సాధించేవాళ్ళం. ఇంక మా పిన తండ్రుల పిల్లలు బాగా చిన్న పిల్లలవడం మూలానా వారిని మేము తీసుకెళ్ళే వారం కాదు. దానికి వాళ్లకి కోపాలు కూడా వచ్చేవి. అయినా మేం పట్టించుకోనేవాళ్ళం కాదు.
ఈ విధంగా ఆనాటి పాత మధుర జ్ఞాపకాలు గుర్తుకు చేసుకొంటూంటే ఎంత బాగుంటుంది. సినిమాలని సెనిమాలు అనడం లేదా ఇడ్లీలని ఇడ్డెన్లు అనడం అదో అనుభూతి.

మీ చిన్ననాటి జ్ఞాపకాలు మధుర వేదనలు నను నా చిన్న నాటి అనుభూతులలో ముంచి లేపింది . ఆసాంతం చదివించింది రాళ్ళ భండి వారూ. అభినందనలు ...శ్రేయోభిలాషి ...నూతక్కి రాఘవేంద్ర రావు. (Kanakambaram)
ReplyDeleteI have not much recollections of Your Idleys or Iddens but i have strong memories of Cinimas at that time. Cinima is a fine entertainment at that time. when ever we go to relatives house they used to take us a cinima.
ReplyDeleteGood olden day touring talkies with the opening song of NAMO VENKATESA still i could able recollect now also.A lot to share with you on this topic. But i am little busy. Thanks for making me to recollecting those memories for some time bye.
Even my grandmother used say idli that way. Still we make fun of her words. She is no more now. Your post remembered her. My brothers used to tease her saying that they had iddenla raktam flowing in their bodies as it was compulsory to eat them everyday.Thanks you.
ReplyDelete