Friday, 28 September 2012

టీ ఉద్యమం లో అగ్రకులాహంకారం - బడుగుల తిరుగుబాటు.

మహాభారత యుద్ధం తరువాత యాదవుల ప్రాబల్యం పెరిగి వాళ్ల ఆగడాలు పెచ్చుమీరి శ్రీ కృష్ణుని, రుక్మిణీ దేవిని, నారదమహర్శిని కూడా అపహాస్యం చేసేంతగా ఎదిగిపోయారు. ఆఖరికి ముసలం పుట్టిన తరువాత వాళ్ళల్లో వాళ్లే తన్నుకొని చచ్చి కుల నాశనాన్ని చేసుకోనారు. కానీ మన తెలంగాణావాదులు తెలంగాణా రావడం బహుదూరం, ఈ లోపులోనే కుల ముసలం పుట్టి అగ్రకులాహంకా రం తో బడుగుల తిరుగుబాటు మొదలైంది. ఇంక తెలంగాణా గురించి మరిచిపోయి బడుగుల ఉద్దారణకి పాటుపడితే రెడ్డి, వెలమల ఆధిపత్యం తగ్గి ప్రజలు సుఖంగా బతుకుతారు. దానికి నిదర్శనమే సూర్యా దినపత్రికలోని ఈ వార్త.

:.పగ్గాలు గుంజుకుందాం! - Surya .:
పగ్గాలు గుంజుకుందాం!
pagga
 

(సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్‌):తెలంగాణ ఉద్యమాన్ని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ సరెైన దిశలో నడిపించడం లేదని ప్రజా యుద్ధనౌక గద్దర్‌ భావిస్తున్నారా? ఉద్యమం పేరుతో కేసీఆర్‌ కుటుంబరాజ్యం సాగిస్తున్నారని అసం తృప్తితో ఉన్నారా? కోదండరామిరెడ్డి ఉద్యమనీతి పాటించడం లేదని ఆగ్రహంతో ఉన్నారా? సెప్టెం బర్‌ 30న కోదండరామిరెడ్డి నేతృ త్వంలో ఇచ్చిన మార్చ్‌ ఫాస్ట్‌ వల్ల లక్ష్యసాధన కాదని భావిస్తున్నారా? ఇప్పటివరకూ వెలమ-రెడ్డి కులాల చేతుల్లో ఉన్న తెలంగాణ ఉద్యమ సారథ్యపగ్గాలు ఇకపెై బడుగులు గుంజుకోనున్నారా? ... సామాజిక తెలంగాణ ఓబీసీ జేఏసీ నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ప్రజాగాయకుడు గద్దర్‌, ఇతర బడుగు నేతలు చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఈ అనుమానం తలెత్తక మానదు. తెలంగాణ ఉద్యమ పథం సరెైన దిశలో సాగేలా కేసీఆర్‌ వ్యవహరించడం లేదన్న అసంతృప్తి, ఆగ్రహం చాలా కాలం నుంచి గద్దర్‌లో ఉంది. అయితే దానిపెై తాను చేసే వ్యాఖ్యల వల్ల అది తెలంగాణను వ్యతిరేకిస్తున్న సీమాంధ్రులకు లబ్థి చేకూరుస్తుందన్న భావనతో, ఆయన ఇటీవలి కాలంలో ఎక్కడా కేసీ ఆర్‌ను విమర్శించకుండా సహనం వహిస్తున్నారు.

Telaఉద్యమ పరిణామాలు, స్వరూపాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. మార్చ్‌కు అనుమతి ఇవ్వాలని ఉద్యమ నేతగా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ అందరినీ కలసి ఒత్తిడి చేశారు. అయితే, తెలంగాణ మార్చ్‌, ఉద్యమాన్ని నడిపిస్తున్న కేసీఆర్‌, కోదండరామిరెడ్డి తీరుపెై మాత్రం గద్దర్‌ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారన్న విషయం మరోసారి వెల్లడయింది. సామాజిక తెలంగాణ ఓబీసీ జేఏసీ కన్వీనర్‌ కస్తూరి జయప్రసాద్‌ తెలంగాణ ఉద్యమ యోద్ధ కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా నిర్వహించిన రౌండ్‌టేబుల్‌కు బీసీ, ఎస్సీ ఉద్యమ నేతలు హాజరయిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో, గద్దర్‌ చేసిన వ్యాఖ్యలు కేసీఆర్‌ నాయకత్వంపెై ఆయన ఏ స్థాయిలో అసంతృప్తితో ఉన్నారన్నది స్పష్టం చేశాయి. ‘కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టేందుకు కొండా లక్ష్మణ్‌బాపూజీ తన జలదృశ్యంలోని ఇంటిని ఇచ్చారు. ఆలాంటి మహానుభావుడు మరణిస్తే కేసీఆర్‌ ఎందుకు రాలేదు? చావుకు రాని కేసీఆర్‌ ఇక ఢిల్లీలోనే ఉంటే బాగుంటుంది. కొడుకుకు ఎమ్మెల్యే, కూతరుకు బతుకమ్మ, అల్లుడుకు అండర్‌గ్రౌండ్‌ పనులు అప్పచె ప్పార’ని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కోదండరామ్‌ ఏ ఉద్యమనీతి ప్రకారం తెలంగాణ మార్చ్‌ నిర్వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

paggalu‘అటు దూకితే నీళ్లు, ఇటు దూకుతే కాళ్లు విరుగుతాయ్‌. మరి ఇదేం ఉద్యమ స్వరూపమో ఆయనకే తెలియాలె. ఇళ్ల దగ్గరే భార్యాపిల్లలతో ఒక రౌండ్‌కొట్టి వస్తే మార్చ్‌ ఫాస్ట్‌ అయిపోతది. అయినా ట్యాంక్‌బండ్‌ దగ్గర ఎందుకు? ల్యాంక్‌హిల్స్‌, రామోజీ భూములపెై ఎందుకు మార్చ్‌ ఫాస్ట్‌ పెట్టడం లేదు? ఈ మార్చ్‌ ఫాస్ట్‌ అవకాశవాద ఎత్తుగడ. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయ’న్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్న అగ్రకులాల నాయకత్వంపెైనా ఆయన నిప్పులు చెరిగారు. అయితే అదే సమయంలో బడుగు బలహీనవర్గాల ఉద్యమానికి ప్రజలు ఎందుకు సహకరించడంలేదో ఓసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని బడుగు నేతలకు చురకలు అంటించారు. సైద్ధాంతిక లోపాలు చక్కదిద్దుకుంటేనే ఇవి సమసిపోయతాయన్నారు. కాగా చాలాకాలం నుంచి కేసీఆర్‌పెై విమర్శలకు దూరంగా ఉన్న గద్దర్‌, మళ్లీ చాలాకాలం తర్వాత ఆయనపెై విమర్శలు ఎక్కుపెట్టడం చర్చనీయాంశమయిం ది. గద్దర్‌ నాయకత్వంలో తెలంగాణ సాధించేందుకు బడుగు బలహీన వర్గాల ఉద్యమ సంఘాలు, జాక్‌లు కలసి రావాలన్న వాదన మళ్లీ తెరపెైకొచ్చింది.

కేసీఆర్‌ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఢిల్లీలో కూర్చుని కాంగ్రెస్‌ రాజకీయ బేరసారాలు సాగిస్తూ, ఉద్యమాన్ని కాంగ్రెస్‌కు తాకట్టుపెడుతున్నం దున, ఇకపెై కేసీఆర్‌ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించవద్దని సామాజిక తెలంగాణ ఓబీసీ జేఏసీ కన్వీనర్‌ కస్తూరి జయప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఉద్యమ నాయకత్వాన్ని అనుభవిస్తున్న అగ్రకు నేతలను పక్కకుతప్పించి, బడుగు బలహీనవర్గాలు పగ్గాలు అందుకోకపోతే, తెలంగాణ వచ్చినా మళ్లీ అగ్రకులాల చేతుల్లో కష్లాలు అనుభవించవలసిందేనని స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ ఓబీసీ జేఏసీని మరింత పటిష్ఠం చేస్తామని, ఉద్యమపగ్గాలు అగ్రకులాల నుంచి తప్పించడమే తమ లక్ష్యమన్నారు. టీపీఎఫ్‌ ఉపాధ్యక్షుడు వేదకుమార్‌, ప్రొఫెసర్‌ సింహాద్రి, వెంకటనారాయణ, అడికె గోపాలకిషన్‌, దాస్యం ఉదయభాస్కర్‌ తదితరులంతా.. అగ్రకులాల నేతృత్వంలో జరిగే ఉద్యమాల్లో రాజకీయ స్వార్థం ఉందని, అందుకే ఉద్యమానికి బడుగులు నేతృత్వం వహించాలని పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment