Saturday, 1 September 2012

వెఱ్ఱి వేయి విధాలు

వెఱ్ఱి వేయి విధాలు అని అందరూ వినే ఉంటారు మీరు ఈ వార్తని చదివితే అది నిజమని అర్థమవుతుంది. ఇంకా నయం ఆ రైతు తాను ఒక్కడే గుండు గేయిన్చుకొన్నాడు. మిగిలిన వాళ్లకి కూడా కొట్టించి అలాగే ఉండమనలేదు. దీనికి సంబంధించిన లంకే, మరియూ పూర్తి పాఠం కింద ఇవ్వడం జరిగింది.
తెలంగాణ వచ్చే వరకు గుండుతోనే...
జగిత్యాలటౌన్‌, మేజర్‌న్యూస్‌ ః ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు తాను గుండుతోనే ఉంటానని ఓ రెైతు ప్రతిజ్ఞ చేశాడు. జగిత్యాల మండలం మోతె గ్రామానికి చెందిన తునికి పెద్ద గంగారాం అనే రెైతు తాను ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పడే వరకు గుండుతోనే ఉంటానని ఆదివారం గుండు గీయించుకొని శపథం చేశాడు. కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్‌ 9 ప్రకటనకు కట్టుబడి ఉండి పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని గంగారాం డిమాండ్‌ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాన్చుడు దోరణి వల్లనే తెలంగాణలో 830 మంది యువకులు బలిదానం చేందారన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.


Surya Telugu Daily Telugu News Paper Online edition published from Andhra Pradesh, India, Andhra news, Andhra Pradesh Politics, India news, Telugu Literature, Telugu Cinema news, Analysis, Hyderabad news, Andhra , Telugu Culture and Tradition, etc

No comments:

Post a Comment