Wednesday 29 August 2012

బొగ్గు బుక్కే కుట్ర! Namasthe Telangana - Telugu News

బొగ్గు బుక్కే కుట్ర!
Namasthe Telangana - Telugu News

ఈ థర్డ్ రేట్ బొగ్గు థర్మల్ ప్రాజెక్టులలో తగలేయ్యడానికి తప్పించి దేనికీ పనికిరాని దాని గురించి నమస్తే తెలంగాణా లోని ఏడుపు చూడండి. పోనీ సదరు వ్యాస కర్తకి ఏమైనా అక్కడి నిల్వలు ఎంతకాలం ఉంటాయో, ఓపెన్ కాస్త మైనింగ్ అంటే అవగాహన ఏమైనా ఉందా అంటే ఆయన కూడా నాలాగే ఈ విషయంలో ఒక అనామకుడు. కానీ ఏడుపు మాత్రం కొండంత.
 
opencost-ఓసీలతోనే సింగరేణిని నడిపిస్తారా?
-సింగరేణికి 150 ఏళ్ల జీవితకాలం.. 60 ఏంళ్లకే ఖతం చేస్తారా?
-ఇప్పటికే శ్మాశానంలా 150 పల్లెలు
-ఇంకెన్ని వందల పల్లెల్ని నాశనం చేస్తారు?
-కేంద్రమంత్రి ప్రకటనపై తెలంగాణ నిప్పులు

(టీ మీడియా, కోల్‌బెల్ట్ ప్రతినిధి):రానున్న అరవై ఏళ్లలో




సింగేణిలో ఇక బొగ్గు ఉండదని కేంద్ర బొగ్గు శాఖమంత్రి ప్రకాశ్ జైస్వాల్ చేసిన ప్రకటనపై తెలంగాణ ప్రాంతంలో, ప్రత్యేకించి సింగరేణి గనుల ప్రాంతంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి సింగరేణికి మరో 150 ఏళ్ల జీవితకాలం ఉన్నప్పటికీ.. ఓపెన్‌కాస్టు విధానాలతో వేగంగా తవ్వేసి, ఇక్కడి వనరులను దోచుకుపోయేందుకు సీమాంధ్ర పాలకులు చేస్తున్న కుట్రలో భాగంగానే కేంద్ర మంత్రి ప్రకటనను చూడాలని తెలంగాణవాదులు అంటున్నారు. 124 సంవత్సరాల సింగరేణిలో ఇప్పటివరకు తవ్వి తీసిన బొగ్గు 700 నుంచి 750 మిలియన్ టన్నులు దాటలేదు. ఈ ప్రాంతం నుంచి బొగ్గు సంపద పెద్ద ఎత్తున తవ్వి తీస్తున్నారు. ఏయేటికాయేడు ఉత్పత్తి లక్ష్యాలను పెంచుకుంటూ పోతున్నారు. గత 20 సంవత్సరాలలో బొగ్గు వార్షిక ఉత్పత్తి మూడు రెట్లు పెరిగింది. ఇట్లా తవ్వి తీసిన బొగ్గు ఈ ప్రాంత ప్రజలకు చెందటం లేదన్నది ఒక అంశమైతే.. ఈ ప్రాంత బొగ్గు శాశ్వతంగా ఈ ప్రాంతానికి చెందకుండా చేసే కుట్రలను ఆంధ్ర వలసపాలకులు పెద్ద ఎత్తున అమలు జరుపుతున్నారన్నది మరో ఆరోపణ.

2000-2001లో 30.27 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగితే అది 2010-11 నాటికి 52.2 మిలియన్ టన్నులకు పెరిగిందంటే సంపదను ఎలా అత్యంత వేగవంతంగా తరలించుకుపోయే కుట్ర సాగుతుందో అర్థం అవుతుంది. ఇంకా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలోని గోదావరితీరంలో 9 వేల మిలియన్ టన్నుల నిల్వలున్నట్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రకాశ్ జైస్వాల్ రాజ్యసభలో ప్రకటించారు. 52 మిలియన్ టన్నుల ఉత్పత్తి ప్రతియేటా జరుగుతుందని, ఇదే స్థాయిలో ఉత్పత్తి జరిగితే 60 ఏండ్ల దాకా సింగరేణి మనుగడ ఉంటుందని ప్రకటించారు. 60 ఏండ్ల తర్వాత సింగరేణి ఉండదని దాదాపు ఆయన చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం మూడు వందల మీటర్ల లోతులోకి వెళ్ళి ఉత్పత్తి చేస్తున్నారు. 9 వేల మిలియన్ టన్నుల బొగ్గు నిల్వ ఉన్నట్లు దాన్ని అన్వేషణ విభాగం గుర్తించినట్లు ఆయన ప్రకటించారు. అంటే వీలైనంత త్వరగా బొగ్గును ఓపెన్‌కాస్టు గనుల ద్వారా తవ్వేయాలనే కుట్రతో యాజమాన్యం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఓపెన్‌కాస్టు గనుల వల్ల సుమారు 150 పల్లెలు స్మశానంలా మారాయి. పల్లెల ఉనికి లేకుండా పోయింది.

పర్యావరణ పరిరక్షణ పత్తాలేదు. పెద్ద ఎత్తున జీవన విధ్వంసం జరిగింది. మరోసారి ఆదే కొనసాగించడం కోసం దాదాపు 150 ఏండ్లున్న సింగరేణి జీవితకాలాన్ని 60 ఏండ్లుగా అవలీలగా కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రకటించేశారన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. వాస్తవానికి భూగర్భ గనుల నుంచి గుర్తించిన దానిలో కేవలం 33 శాతాన్నే వెలికితీస్తారు. అదే ఓపెన్‌కాస్టు అయితే 90 శాతం నుంచి 100 శాతం బొగ్గును వెలికితీస్తారు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో మొత్తం ఓపెన్‌కాస్టు గనులే ఉంటాయా? అనే అనుమానం కలగక మానదు. ఇలా ఇంకెన్ని పల్లెల్ని నాశనం చేస్తారు? ఇంకా తెలంగాణలో ఇంకెంత జీవన విధ్వంసాన్ని కొనసాగిస్తారు? అనేది అంతు చిక్కని విషయంగా మారింది.

ఇంత జరుగుతున్నా చీమకుట్టినట్లయినా లేకుండా ఉంటున్నారన్న అప్రతిష్టను ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు మూటగట్టుకుంటున్నారు. 36 భూగర్భ గనులు, 15 ఓపెన్‌కాస్టు గనులు ప్రస్తుతం సింగరేణిలో కొనసాగుతుండగా 2016-17 నాటికి ఆరు ఓపెన్‌కాస్టు గనులు రానున్నాయి. వాటి పనులు వేగంగా సాగుతున్నాయి. జేవీఆర్ ఓసీ 2, కిష్టారం ఓసీ, మణుగూరు ఓసీ, డోర్లి ఓసీ 2, ఆర్కే ఓసీ, ఆర్‌జీ ఓసీ 3 ఫేజ్ 2 మాత్రమే కాకుండా ఇటీవల బోర్డ్ అప్రూవ్ చేసిన మందమర్రి ఓసీ (కేకే ఓసీ) ఉన్నాయి. ఇంతేకాకుండా భవిష్యత్తులో 2016 నాటికి మూతపడనున్న జీడీకే 8ఏ, కేకే 2, 21 ఇంక్లైన్ ఇల్లందు, జీడీకే 8, పీకే 1 మణుగూరు, జీడీకే 10ఏ, జీడీకే 7 ఎల్‌ఈపీ, ఆర్కే 1ఏ మందమర్రి, ఆర్కే 8 ఎస్‌ఆర్‌పీ లాంటి తొమ్మిది భూగర్భ గనులను కూడా భవిష్యత్తులో ఓసీల కింద మార్చేయనున్నారు.

ప్రస్తుతం దీనికి సింగరేణిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఓపెన్‌కాస్టులు రావు, భవిష్యత్తు అంతా భూగర్భ గనులదే ఉంటుంది అని ఓ వైపు సింగరేణి యాజమాన్యం ప్రకటిస్తూ ఉండగా ఆ ప్రకటనలన్నీ వట్టి బూటకాలేనని, వీలైనంత త్వరగా తెలంగాణ ప్రాంతంలోని సింగరేణిలో గల బొగ్గు సంపదను తరలించుకుని పోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉన్నదని కేంద్ర మంత్రి ప్రకటన స్పష్టం చేస్తున్నది. దీనిపై సింగరేణి ప్రాంతంలోని కార్మికులు, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం సింగరేణిలో 150 మిలియన్‌ల నుంచి 200 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను అన్వేషణ విభాగం గుర్తిస్తూ వస్తోంది. 300 నుంచి 350, 400 మీటర్ల వరకు లోతుకు వెళ్ళి ఈ బొగ్గును గుర్తిస్తోంది. మరో 500 నుంచి 600 మీటర్ల వరకు కూడా అదే విధంగా వెయ్యి మీటర్ల లోతుకు కూడా వెళ్ళడానికి అవకాశాలు లేకపోలేదు. రోజురోజుకూ టెక్నాలజీ పెరుగుతున్నందున ఆ దిశన ఆలోచించాల్సి ఉందని బొగ్గు అన్వేషణ విభాగం నిపుణులు పేర్కొంటున్నారు.

124 ఏండ్లలో కేవలం 700 నుంచి 750 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయగా తొమ్మిది వేల మిలియన్ టన్నుల బొగ్గును 60 ఏండ్లలో తీసేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడం చిన్న విషయం కాదని సింగరేణి నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో కచ్చితంగా ఓసీలవైపే మొగ్గు చూపుతున్నారనడానికి ఇది రుజువుగా పేర్కొనవచ్చని అంటున్నారు. ఏది ఏమైనా ఓసీలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలు మరింత బలంగా వీటిని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని తెలంగాణవాదులు చెబుతున్నారు. 16 ఏండ్ల క్రితం దాకా లక్షా 16 వేలు ఉన్న కార్మికుల సంఖ్య 63 వేలకు కుదించుకుపోవడం కూడా ఇందులో భాగమేనని అంటున్నారు. నూతన ఆర్థిక పారిక్షిశామిక విధానాలు, గ్లోబలైజేషన్ ఫలితాల ప్రభావం సింగరేణిపై ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజావూపతినిధులు సోయితో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఉద్యమకారులు అంటున్నారు. 1989-90 సంవత్సరంలో సింగరేణిని శతవార్షికోత్సవాలను జరుపుకున్నది.

అప్పుడు ప్రకటించిన ప్రణాళిక ప్రకారం భూగర్భ గనులు 45 వరకు ప్రారంభించాల్సి ఉంది. 85 వేల మందికి ఉపాధి కల్పించాల్సి ఉంది. ఆ దిశన సంస్థను ముందుకు తీసుకుపోవడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. భూగర్భ గనులు రాకుంటే రానున్న రోజుల్లో యంత్రాలతో మాత్రమే బొగ్గు ఉత్పత్తి చేసుకుంటారు. అవసరం అయితే తుపాకులు పెట్టి గనులు నడుపుకుంటారు. అందుకే ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేస్తున్నా సింగరేణి కార్మికులు తెలంగాణ ఏర్పాటు ఒక్కటే తమను, తమ ప్రకృతి సంపదను కాపాడుతుందని భావిస్తున్నారు. తెలంగాణ వస్తేనే భూగర్భ గనులు వస్తాయి, ఈ ప్రాంతంలో ఉపాధి లభిస్తుందని నిరుద్యోగులు నమ్ముతున్నారు. వారి ఆకాంక్షకు అనుగుణంగా ఈ ప్రాంత ప్రజావూపతినిధులు వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించాలి.

మరో 9,300 మిలియన్ టన్నుల నిక్షేపాలు...గుర్తించే పనిలో అన్వేషణ విభాగం
సింగరేణిలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో మరో 9,300 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. అయితే వీటిని సింగరేణిలోని అన్వేషణ విభాగం తవ్వకానికి అనుకూలంగా ఉన్నాయో లేదో గుర్తించాల్సి ఉంది. ప్రతి సంవత్సరం 150 నుంచి 200 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను గుర్తిస్తున్న అన్వేషణ విభాగం ఈ పనిలో కూడా నిమగ్నమైంది. ఇప్పటికే గుర్తించిన 9 వేల మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను తవ్వేందుకు సింగరేణి సిద్ధమవుతుండగా.. మరో 9,300 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు అంతకుముందు గుర్తించిన లెక్కల ప్రకారం ఈ ప్రాంతంలోని సీనియర్ బొగ్గు శాఖ అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వం ప్రకటించినమాదిరి ఎప్పటికప్పుడు ఆ రోజు వరకు లెక్కలే వారి దగ్గర ఉంటాయని, రానున్న రోజుల్లోని లెక్కలు ఉండవని సింగరేణికి మరో 150 ఏండ్లు భవిష్యత్తు ఉంటుందని ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని సింగరేణిలోని ఒక ఉన్నతాధికారి స్పష్టం చేశారు. 600 నుంచి వెయ్యి మీటర్ల లోతుకు కూడా అధునాతనమైన టెక్నిక్‌లతో బొగ్గును గుర్తించడానికి, వెలికి తీయడానికి సిద్ధమవుతున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతి యేటా 52 మిలియన్ టన్నుల బొగ్గును తీస్తున్నా లెక్క ప్రకారం ఉన్న 9 వేల మిలియన్ టన్నులు మొత్తం ఓసీలతోనే తీయడం సాధ్యమవుతుందో కాదో తెలియదు కానీ భూగర్భ గనులకే భవిష్యత్తు ఉంటుందని, వాటి ద్వారానే బొగ్గును వెలికి తీస్తారని ఆయన చెప్తున్నారు. ఏది ఏమైనా సింగరేణి ప్రాంతంలోని ప్రజలు సింగరేణికి 60 ఏండ్ల భవిష్యత్తే ఉంటుందని, అప్పటికి బొగ్గు అయిపోతుందని కేంద్ర మంత్రి చేసిన ప్రకటన సంచలనం రేకెత్తించిందంటే అతిశయోక్తి కాదు.
http://www.namasthetelangaana.com/opinion-poll.asp?id=79

1 comment:

  1. Do you have their permission to post this article in your blog, thanks.

    ReplyDelete