కుక్క తోకని గొట్టంలో వేసి ఆరునెలలు బంధించి ఉంచినా వంకర వంకరే కానీ సరి అవదు అని మనకందరికీ తెలిసిన సామెతే. దానిని మన తెలంగాణా నాయకులు ఆ సామెత నిజమని నిరూపించారు. వారి యొక్క ప్రేలాపనలు నిన్న రవీంద్రభారతి లో జరిగిన కార్యక్రమంలో ఈ మగానుబావులు కూసిన కూతలు ఓహో ఆహా అనిపించేలా ఎదుటివారికి వీళ్లు ఎప్పటికీ మారారు కుక్క తోక వంకర మా తెలంగాణా నాయకుల మాటలు, చేతలు వంకర. వారి వంకర మాటలు, చేష్టలు మన ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన వార్త చూస్తె అర్థమవుతుంది. ఆ వార్త ని ఇక్కడ కింద జతచేస్తూ, ఆ పత్రిక యూఆరెల్ అడ్రస్ కూడా ఇవ్వబడింది. చదివి వారి హాస్యవిన్యాసాన్లని చూసి కడుపారా నవ్వుకొని, మీ విమర్శలు రాయండి.
మళ్లీ తెలంగాణ ఉద్యమం
05/08/2012
TAGS:
హైదరాబాద్, ఆగస్టు 4: తెలంగాణ ఉద్యమాన్ని ఈనెల 20నుంచి మళ్లీ చేపట్టనున్నట్టు టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ ప్రకటించారు. చాలారోజులు వౌనం వహించిన కెసిఆర్, శనివారం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ వందశాతం తెలంగాణ వచ్చి తీరుతుందని ప్రకటించారు. పదవీ విరమణ చేసిన టిఎన్జివో సంఘ మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్, కొత్త అధ్యక్షుడు దేవీప్రసాద్‌ల గౌరవార్థం శనివారం అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలంగాణకు చెందిన వివిధ రాజకీయ పక్షాలు, ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కెసిఆర్ మాట్లాడుతూ రెండునెలల నుంచి తాను వౌనంగా ఉంటున్నానని అందరూ అనుకుంటున్నారని, కానీ అలాంటిదేమీ లేదన్నారు. ఎక్కడ దెబ్బకొట్టాలో అక్కడ కొట్టాలని, అయినదానికి కానిదానికి తెలంగాణ వాదు ఆగం కావద్దన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ కోరిక మేరకు వౌనంగా ఉన్నామని, నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రంలో శాంతియుత వాతావరణం ఉండాలని ఆయన కోరారని తెలిపారు. ఉద్రిక్తత పరిస్థితుల్లో కేంద్రం ఒక నిర్ణయాన్ని తీసుకోలేదన్నారు. అయితే మీడియా మాత్రం వౌనంపై సందేహాలు వ్యక్తం చేస్తుందన్నారు. రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటించారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా సిగ్నల్స్ వచ్చాయని తాను చెబితే ఒక చానల్ అలాంటి సిగ్నల్స్ ఏమీ లేవని వార్తను ప్రసారం చేసిందని తెలిపారు. సిగ్నల్స్ తనకు వస్తాయి కానీ, చానల్స్‌కు కాదు కదా? అని కెసిఆర్ ప్రశ్నించారు.
పనె్నండేళ్ల నుంచి ఉద్యమం చేస్తున్నాం. ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు అని కెసిఆర్ వ్యాఖ్యానించారు. కెసిఆర్ వౌనంగా ఉంటే ఏదో జరుగుతుందని సీమాంధ్రులు భయపడటం సహజమేనని అన్నారు. కెసిఆర్ వౌనంగా ఉంటే ఉద్యమం ఆగినట్టు కాదని , ఉద్యమం ఎలా ఉధృతం చేయాలని ఆలోచిస్తున్నట్టు భావించాలన్నారు. ‘మరోసారి ఆగస్టు 20న దుఖాణం పెడదాం. ఉద్యమ కార్యాచరణ నిర్ణయించుకుందాం’ అని అన్నారు. ఈసారి తెలంగాణ ఉద్యమ విశ్వరూపం చూపిద్దామని పిలుపు ఇచ్చారు. గమ్యాన్ని ముద్దాడే వరకు వెనుదిరిగే ప్రసక్తే లేదన్నారు. రాత్రి 11 గంటలకు కేంద్రం తెలంగాణ ప్రకటిస్తే, ఉదయం తొమ్మిది గంటలకల్లా సీమాంధ్ర నేతలు కుట్ర పన్ని తెలంగాణ అడ్డుకున్నారని విమర్శించారు. ఒక్క ఆంధ్రా టీవి డబ్బా చానలైనా తెలంగాణ ఇచ్చి మాట ఎలా తప్పుతారని కేంద్రాన్ని అడిగిందా? అని కెసిఆర్ ప్రశ్నించారు. కెసిఆర్‌కు తెలంగాణపై కేంద్రం నుంచి ఎలాంటి సిగ్నిల్స్ లేవని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలపై కెసిఆర్ స్పందిస్తూ, లగడపాటికి దమాక్ లేదని మండిపడ్డారు. సిగ్నల్స్ ఉద్యమ నేతకు నాకు వస్తది కానీ లగడపాటికి ఎందుకు వస్తదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపిలు పొన్నం ప్రభాకర్, కె కెశవరావులు చేస్తున్నది నిజమైన ఉద్యమమేనని, స్వయంగా తాను పార్లమెంటులో చూశానని కెసిఆర్ తెలిపారు.
తెలంగాణ ఏర్పడిన తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇస్తామన్నారు. స్వామిగౌడ్ తెలంగాణ కేబినెట్లో ఉండాలని, ఆయన ద్వారా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలని తాను ఆశిస్తున్నట్టు తెలిపారు. స్వామిగౌడ్‌ను టిఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత తెలంగాణ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, పెన్షన్వంటి సౌకర్యాలు ఉంటాయని కెసిఆర్ తెలిపారు. టిఎన్జివో మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్, నూతన అధ్యక్షుడు దేవి ప్రసాద్‌రావు, ప్రధాన కార్యదర్శి రవీంద్రరెడ్డిలను కెసిఆర్ సత్కరించారు. తెలంగాణ సాధించేంత వరకు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నట్టు ఎన్జివో నాయకులు ప్రకటించారు.
కాంగ్రెస్ మోసం చేసింది
తెలంగాణ అంశంపై కాంగ్రెస్ మోసం చేసిందని కాంగ్రెస్ నాయకుడు కె కేశవరావు ఆవేదన వ్యక్తం చేశారు. యుపిఏ కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ అంశం ఉందని, సిడబ్ల్యుసి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని, అయినప్పటికీ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యోగులను వేధిస్తే సహించేది లేదని కాంగ్రెస్ ఎంపి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని అన్ని రాజకీయ పక్షాలు తీర్మానం చేస్తే 15 రోజుల్లో తెలంగాణ వస్తుందన్నారు.
ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ తాను రోడ్డున పడ్డానని చంద్రబాబు ఎద్దేవా చేస్తున్నారని, తెలంగాణ కోసం రోడ్డున పడ్డానని అన్నారు. చంద్రబాబు తెలంగాణ విషయంలో మాట తప్పారు. ఆయన అసలు స్వరూపం ప్రజలకు వివరించడానికి రోడ్డున పడ్డానని అన్నారు. తానేమీ టిడిపి అభ్యర్థుల మాదిరిగా డిపాజిట్లు కోల్పోలేదని, తెలంగాణ ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారని అన్నారు.
తుది వరకూ పోరాటం
తెలంగాణ సాధన కోసం తుది వరకు పోరాడతామని స్వామిగౌడ్ అన్నారు. ఉద్యోగ విరమణ చేశాను, ఉద్యమంలో మరింత చురుగ్గా పాల్గొంటానన్నారు. చారిత్రాత్మకమైన సకల జనుల సమ్మె సమయంలో అనేక విమర్శలు వచ్చాయని అయినా భయపడకుండా ఉద్యోగుల అండతో ఉద్యమించామని అన్నారు. ఉద్యమంలో ఉద్యోగులకు కళాకారులు, రాజకీయ నేతలు అండగా నిలిచారన్నారు. బిజెపి అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి, టిఆర్ఎస్ శాసన సభాపక్షం నాయకుడు ఈటెల రాజేంద్ర, సిపిఐ శాసన సభాపక్షం నాయకుడు గుండా మల్లేశం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments:
Post a Comment