Blood sugar test for Rs 2, in 10 seconds - The Times of India
While congratulating Dr.Suman Kapur for the invention of low cost blood testing meter, I request the same scientists to discover/invent the drug for diabetes as there is no permanent cure for the disease. Of course, there are a number of medicines available in the market to control the glucose levels but those drugs wrok as a relief method but not cure permanently. If it is done, the whole world would be indebted to those scientists.
Thursday, 28 June 2012
Wednesday, 11 April 2012
ఓట్స్ తోనే టిఫిన్ చేస్తారా?

ఈ రోజుల్లో ఎవరిని కలిసినా టిఫిన్ చేసావా అనడిగితే ఆ చేసాను అని మనం చాలా గొప్పగా చెబుతూ ఉంటాం ఏం టిఫిన్ చేసావు అని అడిగితె ప్రస్తుత సమయం లో ఓట్స్ తిన్నాను అని చెప్పడం చాలా ఫేషన్ గా మారింది. అసలు ఈ ఓట్స్ కథా కమామిషు కొంత చూద్దాం. బ్రౌణ్యం ప్రకారం చలి దేశాలలో పండే తృణ దాన్యాలవంటి పంట ముఖ్యంగా గుర్రాలకి దాణాగా పనికి వస్తుంది అని ఉంటుంది. ఈ ఓట్స్ స్కాట్లాండ్ లో గుర్రాలకి పెట్టేది గానే ఉంటుంది. ఇంక ఈ ఓట్స్ ని విదేశాల నుండి దిగుమతి చేసుకొని వాటిని ఆకర్షణీయమైన పోట్లాలలో పెట్టి అరకిలో పొట్లం `50/- లు లేదా ఇంకా ఎక్కువ ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి. నేను యశోద ఆసుపత్రి నుండి చికిత్సానంతరం వారం రోజుల తరువాత ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకొనే మొదటి వారం లో మా ఆవిడ పెద్దమ్మగారి కొడుకు ఈ ఓట్స్ పొట్లం ఒకటి తెచ్చి ఇది పాలల్లో కలిపి పెట్టు బలం వచ్చి భీముడిని మించిపోతాడు మీ ఆయన అంటే నాలుగు రోజులు ఆ విధంగానే ఒకసారి పాలల్లో కలుపుకొని, ఇంకోసారి పులిహోర లాగా వండించుకొని నేనుకూడా తిన్నాను. ఆ తరువాత మళ్ళీ చెకప్ కి యశోదా ఆసుపత్రి కి వెళ్ళినప్పుడు అక్కడి వైద్యుడు నిన్న ఆహారంలో ఏమి తిన్నావు అని అడిగినప్పుడు ఈ ఓట్స్ విషయం చెబితే నిన్ను ఓట్స్ తినమని ఎవరు చెప్పారు? అందులో అంత బలం ఉందని ఎవరు చెప్పారు అని నన్ను నానా బూతులు తిట్టి పోశారు. ఆ తరువాత వ్యవసాయ శాస్త్రంలో ఉద్యానశాఖలో స్నాతకోత్తర (M.Sc (Hort.)) పట్టా పొందిన కాన్పూరు స్నేహితుడు శ్రీ కనోజియా ని ఈ ఓట్స్ కథా కమామిషు అడిగితె అతను చెప్పినది ఈ ఓట్స్ అంత గొప్ప బలవర్ధకమైనది కాదు దానిలో మన బియ్యంతో చేసిన అటుకులు లేదా మొక్క జొన్న తో చేసిన ఫ్లేక్స్ లో ఉన్నంత పోషక విలువలే ఉన్నాయని చెప్పారు. కానీ మన టీవీలలో లంగారంమలు, వంటకత్తెలూ ఓట్స్ తినని వాడు వచ్చే జన్మలో గాడిద గా పుడతాడు అన్నంత ప్రచారం చేసి ప్రజలని తప్పు దారి పట్టిస్తున్నారు. ఇంకా పెద్ద పెద్ద కంపెనీల్లు కూడా ఈ విషయంలో తక్కువేమీ తినలేదు. అసలు తింటే ఒట్సే తినాలి లేకపోతె బతుకేలేదు అన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి.
అటుకులు తింటే నామోషీ. ఓట్స్ తింటేనే సోసయిటీలో మనిషి అన్న విధమైన బిల్డప్ ఆపితే మంచిది. అమ్మా లంగరమ్మలూ, లంగరయ్యలూ మరియూ కుహనా వైద్యులు, మీరు ఈ విధమైన అసత్య ప్రచారాలు ఆపి మన దెస పంటలు అయిన అటుకులు, రాగులు, సజ్జలు, జొన్నలు తినేట్లుగా ప్రోత్సహించండి. ఇదే మిమ్మల్ని కోరే నా విన్నపం. అందరూ నాలాగా జిజ్ఞాసతో వైద్యుడిని లేదా శాస్త్ర వేట్టాలని కనుక్కోకపోవచ్చు. వారిని మీ తప్పుడు సమాచారంతో మోసగించకండి.
Friday, 27 January 2012
ఇడ్డెన్లు - సెనిమాలు
ఈ రోజులలో ఇడ్లీ తయారు చేయడం అంటే చాలా సులభంగా అయిపోతోంది కానీ మా చిన్నతనం లో ఇడ్లీలు తయారు చేయడం ఒక పెద్ద పనిగా ఉండేది. మా అమ్మ ఇడ్లీలని ఇడ్డెన్లు అని పలికేది. ఆవిడ బతికి ఉంటె ఇప్పుడు ఆవిడకి 74 సంవత్సరాలు ఉండేవి. ఆ ఇడ్డెన్లు తయారు చేయడానికి మినప పప్పుని ముందురోజు సాయంత్రం రెండు మూడు గంటల పాటు నానపోసి, దానితో పాటుగా ఉప్పుడు రవ్వ కూడా నాన పోసేవారు. కొంతమంది శిష్టుల ఇళ్ళలో ఆ ఉప్పుడు రవ్వని ఉపయోగించేవారు కాదు. వాళ్ళు బియ్యాన్ని నూక పట్టించి ఇంట్లో ఉంచుకొనే వారు. కానీ ఈ ఉప్పుడు రవ్వకి ఉన్న ప్రాశస్త్యం బియ్యపు రవ్వకి ఉండేది కాదు. ఆ నాన పెట్టిన మినప పప్పుని రుబ్బి దానిలో ముందుగా నానబోసిన ఉప్పుడు రవ్వో లేదా బియ్యపు రవ్వో ఉప్పు వేసి కలిపి గిన్నె పై మూత పెట్టేవారు. మరునాడు పొద్దున్నే లేచి ఆ పిండి ఎలా ఉందొ పరీక్షించేవారు. అప్పటికి ఆ పిండి బుస బుసా పొంగి చూడడానికి కాచిన పాల మీది పొంగులాగా కనిపించేది. ఆ ఊరుపిండిని ఇడ్డెన్లు (మా అమ్మ పరిభాషలో) పాత్ర ఇత్తడిది ఉండేది దానికి రెండే ప్లేట్లు ఉండేవి ఒక్కొక్క ప్లేట్ లోనూ మూడూ లేదా నాలుగు ఇడ్లీలు తయారయ్యేవి. ఆ ప్లేట్ల మీద గుడ్డ వేసి ఈ తయారైన ఊరు పిండిని వేసి పాత్రలో నీళ్ళు పోసి ఈ ఊరు పిండి వేసిన ప్లేట్లని ఆ పాత్రలో ఉంచి మూత పెట్టి పొయ్యి మీద పెట్టేవారు. ఆ రోజులలో గేస్ స్టవ్ లు లేవు. అందుచేత కట్టెల పొయ్యి ఇంట్లో తాయారు చేసేవారు. ఆ తరువాత ఉదికాయో లేదో చూసుకొని దించిన తరువాత ఆ ఇడ్డెన్లు ని పెట్టడానికి చట్నీ తయారు చేయడం, దానితో పాటుగా సాంబారు తయారు చేయడం ఒక ప్రహసనం గా జరిగేది. ఈ రోజు అంట కష్టపడక్కరలేకుండా మిక్సీలు, గ్రైన్డర్లూ ఉన్నాయి. అంతేకాకుండా ఇడ్లీ పాత్రలు నాలుగు అయిదు ప్లేట్లు ఒక్కసారిగా పట్టే పాత్రలు కూడా ఉండడం వలన ఇడ్లీ తయారీ అంత కష్టమైన పని కాదు. ఇప్పుడు ఇంకా అడ్వాన్సు అయి ఇన్స్టెంట్ ఇడ్లీ పిండి కూడా వచ్చేసింది. అందుచేత ఇడ్లీ తయారీ ఇంకా సులభతరం అయిపొయింది.
ఆ విధంగానే, మా అమ్మ గారు, నాయనమ్మ, అమ్మమ్మ గారలు సినిమాలని సెనిమాలు అనేవారు. ఇప్పుడు నా కూతురు 14 సంవత్సరాల పిల్ల కి చెబితే ఒకటే నవ్వు. మా అమ్మకి ఆ సెనిమాలు చూడడం చాలా ఇష్టంగానే ఉండేది. ఆవిడ నెలకు ఒకటి రెండు సెనిమాలు తప్పక చూసేది. మేము పెద్దవాళ్ళం అయి ఉద్యోగాలు వచ్చి వేరే చోట్ల స్థిరపడ్డాక ఆవిడ ఆ విధంగా సెనిమాలు చూడడం మానేసింది. మా మేనత్తకి కూడా ఈ సేనీమాల పిచ్చి బాగానే ఉండేది. ఇంకా మేము పిల్లలం అంతా మా మేనత్తగారి పిల్లలూ, నేను మా చిన్నన్నయ్య మా చెల్లెలు అందరమూ దసరా, సంక్రాంతి, వేసంగి సెలవులకి తాతయ్యగారి ఇంటికి వెడితే మాకు ఇంక ఈ సినిమాల పండగే. మా పెద్దన్నయ్య మాతో వచ్చేవాడు కాదు కారణం నా కన్నా దగ్గర దగ్గర అయిదు సంవత్సరాలు పెద్ద. అందుకని మాతో సినిమాలకి ఆంటే మాట్నీలకి వచ్చేవాడు కాదు. తాను తన స్నేహితులతో చూసేవాడు. కొత్త సినిమా వస్తే తాతయ్యగారి దగ్గరకి మా మేనత్తగారి పెద్దవాడిని (మా చెల్లెలి వయసువాడు) పంపి సినిమాకి ఆరోజు మాట్నీకి కావలసిన డబ్బులు ఇచ్చేవరకూ ఆయనని కోసి కొప్పరాళ్ళకు వేసేసి ఆఖరికి సాధించేవాళ్ళం. ఇంక మా పిన తండ్రుల పిల్లలు బాగా చిన్న పిల్లలవడం మూలానా వారిని మేము తీసుకెళ్ళే వారం కాదు. దానికి వాళ్లకి కోపాలు కూడా వచ్చేవి. అయినా మేం పట్టించుకోనేవాళ్ళం కాదు.
ఈ విధంగా ఆనాటి పాత మధుర జ్ఞాపకాలు గుర్తుకు చేసుకొంటూంటే ఎంత బాగుంటుంది. సినిమాలని సెనిమాలు అనడం లేదా ఇడ్లీలని ఇడ్డెన్లు అనడం అదో అనుభూతి.

Friday, 20 January 2012
అంబేద్కర్ - దేశ భక్తుడా? దేశ ద్రోహా?
భీమ్ రామ్ జీ ఆంబేద్కర్ ని దేశ భక్తుడు అనదగ్గ కారణాలు ఏవీ నాకైతే కనబడలేదు. కానీ ఉత్తర్ ప్రదేశ్ లోని నేతామణి కుమారి మాయావతి ఆవిడ నిత్యమూ పూజించే కాన్షీ రామ్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోని సంకర రావు లేదా మంద కృష్ణ మాదిగ లేదా కత్తి పద్మారావు మరియూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఆంబేద్కర్ కి ఇవ్వ వలసిన గౌరవం కన్నా ఎక్కువ ఇచ్చి మిగిలినవారిని వెధవలు అని నిరూపించ ప్రయత్నం చాలా సార్లు చేశారు. ఇప్పుడూ చ్సెస్తున్నారు.
నా దృష్టి లో ఆంబేద్కర్ ఒక దేశ ద్రోహి. బరోడా మహారాజు కి అమ్ముడుపోయి ఆ రాజు కాళ్ళు ఒత్తిన వ్యక్తి. మాహాత్మా గాంధీ ఈ దళిత నేతని తమ సమాజం వారిని మిగిలిన దళితులని స్వాతంత్ర్య పోరాటం లో పాలుపంచుకొనేవిధంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడానికి రమ్మనమని నిమంత్రణ ఇస్తే దానిని తిరస్కరించి, బ్రిటిష్ వాళ్ళకి తొత్తుగా వ్యవహరించిన మగానుభావుడు. ఈయన 1936లో స్వంతంగా ఇండెపెండెంట్ లేబర్ పార్టీ పెట్టి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కి ఒక 15 స్థానాలు గెలుచు కొన్నాడు. తాను పుట్టిన మతంలో తనకు అవమానం జరిగిపోతోందంటూ వెళ్లి బౌద్ధ మతం లో చేరిపోయాడు. స్వంత మతం మీద నమ్మకం లేక ఇతరమతాలలో దూరేవాళ్ళకు ఉండే దుర్గుణాలు అన్నీ ఈ పుణ్యపురుషుడు మూటకట్టుకొన్నాడు. ఎలాగంటే హిందీ లో సామెత ఉంది 'నయా ముల్లా ప్యాజ్ తేజ్ ఖాతా హై' అని ఆ విధంగా ఒక మతం మీద కక్ష కట్టిన దయామయుడు మన అంబేద్కరుడు.
భారత దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న చాలా మండి దేశ ద్రోహులు స్వతంత్రం వచ్చాక అనేక రకాల పదవులు పొందిన వారు ఉన్నారు. వారిలో మన అంబేద్కరుడు అగ్ర తాంబూలానికి అర్హుడు. కారణం ఈయనని స్వతంత్ర ఉద్యమం లో పాలుపంచుకొమ్మంటే కాదు పొమ్మన్న పెద్దమనిషి భారత రాజ్యాంగ కమిటీ కి అధ్యక్షుడిగా చేయ బడి ఎంతోమంది కష్టపడి తయారుచేస్తే మొదటి పుట పైన తన సంతకాన్ని గిలికి అది తనదే అన్న బిల్డప్ ఇచ్చిన అరివీరభయంకరుడు. అంటే ఎదుటివారి శ్రమని దోచుకొన్న మహా మనిషి.
ఈయన లోక్ సభ కి గెలవలేని నాయ్కుడు. ఆ తరువాత మన విజయ్ మాల్య లేదా రాహుల్ బజాజ్ లేదా హేమామాలిని లాగా దొడ్డి దారిన అనగా రాజ్య సభకి నామినేట్ చేయబడిన మహా నాయకుడు. ఈయనని ప్రధాన మంత్రి నెహ్రూ తన లా మినిస్టర్ గా నియమిస్తే, తనకి మంచి పోర్ట్ ఫోలియో ఇవ్వమని నిస్సుగ్గుగా అడగగలిగిన పురాణ పురుషుడు.
దేశానికి రిజర్వేషన్లు అనే శాపాన్ని ఇచ్చి, కులాల కుమ్ములాట అనేదానికి ప్రాణం పోసిన అపర బ్రహ్మ. ఇటువంటి వ్యక్తిని భుజాన మోసుకొని తిరిగే వాళ్ళు మన మాయావతి, కన్షీరామ్, కాంగ్రెస్ నాయకులు మరియూ తదితర పార్టీల నాయకులు. ఇటువంటి వాడికి భారత రత్న చచ్చిన 30 ఏళ్లకి ప్రసాదించిన కాంగ్రెస్ పార్టీ కూడా దేశ ద్రోహులని ప్రోత్సహించే పార్టీగా భావించాలి.
Wednesday, 7 December 2011
కొత్త తరం తల రంగు ఫేషన్లు
కన్యాశుల్కం నాటకంలో బుచ్చమ్మని మొదటిసారి చూసి వాట్ ఏ బ్యూటీఫుల్ యంగ్ విడో అని గిరీశం తనలో అనుకొంటాడు, మా అక్కే జుట్టుకు చవుర్రాసుకోదు అంటాడు వెంకటేశం. ఆ తరువాత గిరీశం వితంతువులు తలకి నూనె రాసుకోరని, ఆ విధంగా తలకు నూనె రాసుకోకపోవడం వల్ల జుట్టు ఎర్రగా పీచులా తయారవుతుందని తన శిష్య పరమాణువుకి వివరిస్తాడు. అది వేరే కథ.
ప్రస్తుతం వస్తున్న రక రకాల జుట్టుకు వేసే రంగుల ప్రకటన్లు చూసిన తరువాత మళ్ళీ మనం బుచ్చమ్మ జుట్టు రంగునే ఫేషన్ గా అనుకొనే పరిస్తితి దాపురిస్తుందని ఎవరూ అనుకకొని ఉండరు. కానీ నేడు టీవీలలో వస్తున్న ప్రకటన్లు అలాగే ఉంటున్నాయి. గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం నాటకం రాసే నాటికి విధవలకి అయితే గుండు గీయించేవారు లేదా బుచ్చమ్మ లాంటి బాల వితంతువు అయితే కొన్ని సార్లు గుండు గీయించకుండా తైల సంస్కారం లేకుండా జడ వేసుకోకుండా నిర్బంధించేవారు.
కానీ నేడు నాగరికం పెరిగిన ఈ రోజులలో తలకి తైల సంస్కారం అనేది ఒక అనాగరిక చర్యగా భావిస్తూ స్త్రీ, పురుష భేదం లేకుండా బుర్ర గొరిగించుకోవడమో లేదా తలకి వారానికి ఒక సారి గోరింటాకు రుబ్బి పూసుకోవడమో లేదా తలకి బుచ్చమ్మ జుట్టు రంగు వేసుకోవడమో ఫేషన్గా మారి పోయి చక్కగా జడ వేసుకొన్న స్త్రీని చిన్న చూపు చూసే పరిస్థితి దాపురించిందని తెలిస్తే గురజాడ అప్పారావు గారు ఖచ్చితంగా ఉరిపోసుకోవడం ఖాయం.
బజార్లో ఏవేవో కంపెనీల పేర్లతో తలకి రంగువేసుకోవడానికి పనికివచ్చే వేర్వేరు పొడులు, అరకులూ చాలానే ఉన్నాయి. అందులో ఈ బుచ్చమ్మ రంగుకూడా దొరుకుతోంది.మన పూర్వపు కవులు మరియూ కొంతమంది నాలాంటి ఛాందసులు ఈ రకమైన పోకడలని చూసి బాధ పడడం మినహా ఏమీ చేయలేని పరిస్తితి. ఒకప్పుడు దక్షిణ భారత దేశంలోని స్త్రీలు జుట్టు కత్తిరించడమంటే ఘోర పాపంగా తలచేవారు. ఇప్పుడు జుట్టు కత్తిరింపునకు నోచుకోలేదని తెలిస్తే మిగిలిన స్త్రీలు వారిని అవహేళన చేసే స్థాయికి ఎదిగి పోయాం. తలకి రంగు వేసుకోవడం కొద్దిరోజులు ఆలస్యమయితే పూర్వం పంచరంగుల సినిమాలు వచ్చేవి ఆ విధంగా తల మీదే పంచ రంగులు కనిపిస్తాయి.
నాలాంటి ధరఖర్వాటుడి లాంటి వాడిని వదిలేస్తే, ఆడ కానీ మగ కానీ ఒక వయసు వచ్చాక జుట్టు కాస్త నెరిసినట్లు కనిపిస్తేనే చమక్ ఉంటుంది. మరీ 20 ఏళ్ళు నుండి 40 ఏళ్ల లోపులో వారు జుట్టు నెరిసిపోతోందని నల్లటి రంగు వేసుకోవడం బాగానే ఉంటుంది కానీ మరీ ఏదో ప్రకటనలో కరీనా కపూర్ జుట్టు రంగు బుచ్చమ్మ జుట్టు రంగు వేసుకొంటే అందం మాట ఎలా ఉన్నా డోకు రావడం మాత్రం ఖాయం.

Thursday, 10 November 2011
మారుతున్న వేషధారణ
నా చిన్నతనంలో మా అమ్మ, మా అమ్మమ్మ, నాయనమ్మ గారలు పాడె జానపద గేయాలలో ధర్మ రాజుని దారిద్ర్య దేవత ఆవహించ బోయే ముందు ఆయనని ఆవహించి, పీడించలేనని ఏడుస్తుంది. అందులో కొన్ని చరణాలలో ఈ విధంగా పాడుతూ ఏడుస్తుంది. నట్టింటి చిట్టూక తోక్కడే రాజూ, చాకటింటీ బట్ట కట్టడే రాజూ, ఆ ధర్మ నందనుని నే చేరలేనే. ఇది జానపద గీతం. సరే. కానీ మా పెద్ద తాతయ్యగారు చాకలి వాళ్లు ఉతికి తెచ్చిన బట్టలని కట్టేవారు కాదు. చాకలికి వేసిన తరువాత వాటిని ఇంట్లో మళ్లీ తడిపించి ఆరిన తరువాతే ఆయన ధోవతీని కట్టేవారు. అలాగే మా తాతగారు బియ్యే బియ్యీడీ చదివి మార్టేరు ఉన్నత పాఠశాలలొ పనిచేసి కూడా ఒకసారి కట్టి విడిచిన పంచెని మళ్లీ ఉతికి, చలువ చేసేవరకూ కట్టే వారు కాదు. నేను ఈ చెప్పే మాటలు ఒక్క మా కుటుంబం లో మా పితామహులే కాదు. మా స్వగ్రామం పెద్దేవంలోనూ మరియూ ఆ చుట్టుపక్కల గ్రామాలలో చాలామంది ఆ విధంగానే ఉండేవారు.
వారి తరువాత తరాలలోని వారికి ఫేషన్లు ఎక్కువయి పొడుగు లాగులు (trousers), పొడుగు లేదా పొట్టి చొక్కాలు (full sleaves and bush shirts) వేసుకొనే వారు. అంటే మా నాన్న గారు, ఆయన సోదరుల తరంలోని వాళ్ళన్నమాట. వాళ్లు తమ బట్టలని చాకలికి వేసి ఇస్త్రీ చేసిన బట్టలనే వేసుకొనే స్థాయికి వచ్చారు. మా స్వగ్రామం లో మా ఇంటి రజకుడి పేరు కిష్టి గాడు. అతనికి, తన ఆర్ధిక స్థోమత లేక బనీను వేసుకొని తిరిగేవాడు. అందుచేత ఊళ్ళో ఎవరైనా బనీను వేసుకొని కూర్చొంటే ఏమిట్రా చాకలి కిష్టిగాడి లా జబ్బాల దాకా బనీను వేసుకొని కూర్చోన్నావు అనే వారు. ఆ రోజులలో మా నాన్న గారు వాళ్ళూ పంట్లాములు లూజుగా ఉండేవి వేసుకొనే వారు. వాటి తో పాటుగా ఫుల్ సూట్లు ఉండేవి. మీకు బాగా అర్థమవ్వాలంటే, తోడికోడళ్ళు చిత్రంలో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు లేదా మిస్సమ్మ చిత్రంలో శ్రీ నందమూరి తారక రామారావు గారు, నాగేశ్వర రావులు ధరించిన లాగులు లాంటివన్నమాట. ఆ తరువాత అరవయ్యో దశకం మధ్యలో గొట్టాం (నేరో కట్) పాంట్లు వచ్చాయి. అవి చాలా కాలం రాజ్యమేలాయి.
ఆ తరువాత మా తరంలోని వాళ్ళం కూడా పొడుగు లాగులూ చొక్కాలే వేసుకొనే వారం. అందులోనే చాలా రకాలు వచ్చాయి. డెబ్భయ్యవ దశకం మధ్యలో గొట్టాం పాంట్లు పోయి బెల్ బాటం పాంట్లు వచ్చాయి. ఇవి కూడా చాలాకాలం రాజ్యమేలాయి. అనగా నేను కాలేజీలో చదివే రోజులలో ఈ బెల్ బాటం లు ఫేషన్.
అంతకుముందే అంటే అరవయ్యవ దశకం మధ్యలో అంటే నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే మన దేశం లోని కి హిప్పీలు, యప్పీలు దిగుమతి అయ్యారు. వారి విచిత్ర వేషధారణ ఏమిటంటే ఒక దేవతా వస్త్ర రాజాన్ని ధరించేవారు. ఆ వస్త్ర రాజమే జీన్స్ పాంట్. అది టెంట్ లకి వాడే ఒక మొద్దు కేన్వాస్ గుడ్డ. అంటే మనము వేసుకొనే కేన్వాస్ బూట్ల గుడ్డ అని కూడా చెప్పవచ్చు. అది చాలా కాలం మన దేశం లో పెద్దగా పాపులర్ కాలేదు కారణం దాని కథా కమామిషు వింతగా ఉండడమే కాకుండా దానితో లాగులు కుట్టడం మన దర్జీలకి వచ్చేది కాదు. చాలా వరకూ బజార్ లో దొరికే జీన్స్ పాంట్లు అన్నీ ఎక్కడో తయారయి మనకి దిగుమతి అయ్యాఎవి ఆ తరువాత మన దేశం లోని దర్జీలు తమ కుట్టు యంత్రాలని ఈ కాన్వాస్ గుడ్డతో పొడుగు లాగులు కుట్టడం చేసినా చాలా మంది వాటిని హీనంగానే చూసేవారు. ఎందుకంటే వాటిని తడపడానికి కానీ, ఇస్త్రీ చేయడానికి కానీ వీలుండేది కాదు.
అసలు ఈ జీన్స్ పాంట్ గని కార్మికులకి, ఇతర శారీరక శ్రమతో కూడుకొన్న కార్మికులు ఎక్కువగా వేసుకొనేవారు. వాటి మన్నిక మరియూ ఉతకవలసిన అవసరం లేదు కారణం దానిని ఉతకడమంటే oka బ్రహ్మ యత్నం గా భావించేవారు. నేను కాలేజీలో చదువుకొనే రోజులలో ఎవరైనా జీన్స్ పాంట్ వేసుకొని వస్తే వాడిని చాలా చిన్న చూపు చూసే వాళ్ళం. పాపం ఎక్కువ బట్టలు కొనలేని స్థితిలో ఉన్నాడు కనుకనే ఆ మొద్దు గుడ్డ తో కుట్టిన పాంట్ కొనుక్కోన్నాడని భావించే వారము. ప్రస్తుతం ఆ జీన్స్ అనేక రకాల ఆకారాలు మారి, చిరుగుల జీన్స్, కిటికీల జీన్స్, వెలిసిపోయిన జీన్స్ అని రకరకాలు మన అంగళ్ళలో దొరుకుతున్నాయి. వీటిని ఉతకాల్సిన అవసరం ఉండదు. ఎక్కడ పడితే అక్కడ డేకవచ్చు. ఆ విధంగా ఈ జీన్స్ అనే దేవతా వస్త్రం వేసుకొని డేకడమే అంతే కానీ దానిని ఉతికి ఆరేసే వాళ్లు చాలా తక్కువమంది. నేనయితే ఒక వస్త్రాన్ని ఉతకడం అనేది ఒక పంచవర్ష ప్రణాళిక తరువాతే జరగడం వలన ఏ రోగాలు వస్తాయో నని భయపడి చస్తూ ఉంటాను. అంతే కాదు. నేను ఇంతవరకూ ఒక్క జీన్స్ పాంట్ కూడా వేసుకోలేదు.
ఎనభయ్యవ దశకంలో ఇంకొక వస్త్ర రాజం వచ్చింది. అది నేను ఇంతకుముందు చెప్పిన మా చాకలి కిష్టిగాడు తొడుక్కొనే బనియన్. దాని పేరే టీ షర్ట్. ఇంక ఈ టీ షర్ట్ అంటే లోపల బనియన్ వేసుకొనే అవసరం ఉండదు ఎందుకంటే వీళ్లు మా చాకలి కిష్టి గాడి లాగా జబ్బాల దాకా బనియన్ వేసుకొని తిరగడమే కారణం. ఆ టీ షర్టు లేదా మా చాకలి కిష్టిగాడి బనియన్ వేసుకొన్న వాళ్లని చూస్తే నాకు ఒక్కో సారి వాళ్ల మీద జాలి కలుగుతుంది. కారణం పేద వాడి గుడ్డని కూడా వీళ్లు జీన్స్ మరియూ టీ షర్ట్ పేరుతొ లాక్కొన్నారు అని. ఈ చాకలి కిష్టి గాడి జబ్బల బనియన్ మరియూ రాళ్లు కొట్టే వారి ముతక గుడ్డ పాంట్ లని అమ్మాయిలూ మరియూ వారి తల్లిదండ్రులు తొడుక్కోవడమే కాకుండా తమ యొక్క భావదారిద్ర్యాన్ని పదిమందికీ చూపిస్తున్నారు. ఫేషన్ పేరుతొ అమెరికా వారు ఈ విధంగా సొమ్ము చేసుకొంటున్నారు.
ఈ విధంగా మారిన మగవారి వేషధారణ మారి పోయి కనీసం ఒక్క చాకలి కిష్టిగాడి బనియన్ మరియూ జీన్స్ ప్యాంటు లేని వారిని చిన్న చూపు చూసే రోజులు వచ్చాయి. అమ్మాయికి లంగా, ఓణీ లేదా సల్వార్, కమీజ్ లు లేకపోయినా ఫరవాలేదు కానీ ఆ దేవతా వస్త్రాలు కనీసం ఒక్క జత అయినా ఉండాలని కోరుకొనే తల్లిదండ్రులు ఈ దేశంలో చాలామందే ఉన్నారు.
ఇంక ఈ వేషధారణ ఏయే పోకడలు పోనున్నదో ఎవరికి ఎరుక.
(ఇందులో రజకుల కుల ప్రస్తావన ఉన్నది. అది కావాలని వారిని అవమానించేందుకు రాసినది కాదు. ఒక వేళ తెలియక నొప్పిస్తే క్షమించ ప్రార్థన).

Tuesday, 8 November 2011
సంస్కృత సుభాషితం: తెలంగాణావాదం
సంస్కృతంలో చెప్పిన ఈ కింది శ్లోకం ఒకటి ఎప్పుడో చిన్నపుడు చదువుకొన్నాను కానీ నేటి తెలంగాణా వాదాని కి సరిగ్గా సరిపోతుంది అది:
దుర్బలస్య బలం రాజా బాలానాం రొదనం బలం |
బలం మూర్ఖస్య మౌనిత్వం చౌరాణాం అనృతం బలం ||
పైన చెప్పిన సుభాషితం మన తెలంగాణా వాదులకి సరిగ్గా సరిపోతుంది. ఎలాగంటే:
1.దుర్బలస్య బలం రాజా:
దుర్బలులకు రాజే బలాన్ని ఇస్తాడు అని అర్థం. ఈ తెలంగాణా వాదులు, వారికి ఏమీ కాదు అనుకొన్న సమయంలో గ్రామ సింహాలు కూడా ఏదో పెద్ద పులులం అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. అదే వీరి తప్పుడు పనులకి పోలీసులు కనుక చర్యలు తీసుకొంటే వెంటనే వీరికి స్వయం ప్రతిపత్తి కలిగిన వీరికి తల్లిలాంటి మానవ హక్కుల సంఘం గుర్తుకు వచ్చి దాని చీర చెంగులో దాక్కొని తమ మీద పెట్టిన కేసులని తీయిన్చేసుకొనే ప్రయత్నం చేస్తారు. అంటే వీళ్లు మానసికంగా దుర్బలులు అందుచేతనే వేరే వారికి కంప్లెయింట్ చేస్తారు.అనగా ఈ దుర్బలులకి వారి తల్లి లాంటి మానవ హక్కుల సంఘం బలం.
2.బాలానాం రొదనం బలం:
చంటి పిల్లలకి నోరు ఉండదు. అందుచేత వారికి ఏది కావాల్సి వచ్చినా ఏడ్చి సాధిస్తారు. మన తెలంగాణా వాదులకి ఏడవడం బాగా వచ్చునని మన అందరికీ బాగా తెలిసినదే. అదే వీరి బలం. ప్రతీ దానికి ఏడుపే. ఎదుటివాడు సంపాదించాడు అని ఏడుపు. బాగుపదిపోయాడని ఏడుపు. ఈ ఉద్యమం పుట్టి ఆరు సంవత్సరాలు మాత్రమె అయ్యింది. ఆ విధంగా రకరకాలుగా ఏడ్చి తెలంగాణా కు అనుకూలంగా ఒక దొంగ ప్రకటన ప్రకటన ఇప్పించుకొన్నారు. కాబట్టి వీరికి ఈ బాలానాం రొదనం బలం అనే నానుడి సరిగ్గా సరిపోతుంది.
3.బలం మూర్ఖస్య మౌనిత్వం:
మూర్ఖుడితో వాదించడం కన్నామౌనంగా ఉండడమే బలం అని అర్థం. ఈ తెలంగాణా వాదులకి మూర్ఖత్వం కూడా ఎక్కువే. ఒక సారి అభివృద్ధి జరగలేదు అంటారు. అది కాక పొతే మీరు మా ఉద్యోగాలు, నీళ్లు, నిధులు పదవులు అన్నీ దోచేసారని అంటారు. ఒకసారి ఆత్మ గౌరవం అంటారు. ఇంకొక సారి మమ్మల్ని మేము పరిపాలించుకొంటాం అంటారు. ఇంకొక సారి తెలంగాణా మా నాలుగో నలభయ్యో కోట్ల ప్రజల ఆకాంక్ష అంటారు. ఇవన్నీ అయిన ఆతరువాత మా తెలంగాణా మాకు కావాలి అని మూర్ఖవాదానికి దిగుతారు. ఆ మూర్ఖవాదానికి ఎవరూ సమాధానం చెప్పలేరు. అందుచేత ఆ మూర్ఖ వాదం మొదలయినప్పుడు మనం మౌనం వహించడమే మన బలం. ఎందుకంటే వీళ్లు కొంత సేపు అరిచి గొంతు నొప్పి పుట్టి వాళ్ళే చల్లబడి ఊరుకొంటారు.
4.చౌరాణాం అనృతం బలం:
దొంగకి అబద్ధం చెప్పడమే బలం. మనం న్యాయమంగా చూస్తే ఈ తెలంగాణా వాదులు కోస్తా, రాయలసీమ వాసుల ఉద్యోగాలని తమ జనాభా యొక్క దామాషా కన్నా ఎక్కువగా అనుభవిస్తూ ఎదుటివారు తమని దోచుకోన్నారని ప్రచారం చేస్తారు. వీరి నాయకులు ఒకరు దొంగ సర్టిఫికేట్ లతో విదేశాలకి పోయే మహా నాయకుడు. ఒకరు ప్రజల ను బెదిరించి వారి సొమ్ములని దోచేసే మహా నాయకులు. మరొకరు హైదరాబాద్ నగరంలో ఖాళీ కనిపిస్తే చాలు తనవారితో గుడిసెలు వేయించిన మహానుభావుడు ఇప్పుడు కాటికి కాళ్లు చాపుకొన్న పర్స్తితిలో ఎదుటివారిని తప్పు పడతారు. ఒక ఆయన చేసేవన్నీ దొంగ దీక్షలే. అబద్ధాలే తప్ప ఏ రోజూ నిజం చెప్పనని ఒట్టు పెట్టుకొన్న పార్టీ కి నాయకుడు. ఒక ఎమ్మెల్యే గారు ఎదుటపడి దాడి చేయలేక దద్దమ్మలా తన గూండాని కారు డ్రయివర్ అని చెప్పి వెనక నుండి కొట్టించే ప్రబుద్ధుడు. ఇన్ని దొంగతనాలు దొంగ పనులూ చేసి తాము పాలలో స్నానం చేసామన్న రీతిలో వ్యవహరిస్తూ ఉంటారు. అంటే చౌరాణాం అనృతం బలం నిజమనే కదా.

Subscribe to:
Posts (Atom)